ఆంధ్రప్రదేశ్‌

చెట్టులెక్కగలను...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, నవంబర్ 8: ‘చెట్టులెక్కగలను...పుట్టలెక్కగలను.. చిటారు కొమ్మన చిగురు కోయగలను’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు నడుముకు మోకు కట్టుకొని కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరి గెలను దింపి అలనాటి చెంచులక్ష్మి చిత్రంలోని పాటను మరోసారి గుర్తుచేశారు. మంగళవారం ఉండి మండలంలోని వెలివర్రు గ్రామంలో జనచైతన్య యాత్ర సందర్భంగా మోటారు సైకిల్ ర్యాలీలో వెడుతున్న ఎమ్మెల్యే శివరామరాజుకు గ్రామంలో కొబ్బరి దింపు కార్మికులు కాయలు దింపుతూ కనిపించారు. అంతే అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే శివ వారి నడుముకు ఉన్న మోకు తీసుకుని తాను కట్టుకొని, కొబ్బరిచెట్టు ఎక్కి ఒక గెల కొబ్బరికాయలు దింపి, అందరినీ ఆశ్చర్యపరిచారు.