ఆంధ్రప్రదేశ్‌

విశాఖ డెయిరీకి ‘తుమ్మపాల’ పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 9: విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం నిర్వహణ బాధ్యతలను విశాఖ డెయిరీకి అప్పగించనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రైతు ప్రతినిధులతో కలిసి చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనకాపల్లి సమీపంలో ఉన్న చక్కెర కర్మాగారం ఆధునీకరణకు నోచుకోకపోవడంతో గత రెండు సీజన్లుగా చక్కెర ఉత్పత్తి నిలిచిపోయింది. కర్మాగారాన్ని ఆధునీకరించేందుకు నిధుల సమస్యగా మారడంతో చక్కెర ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో దాదాపు 50 కోట్ల వరకూ కర్మాగారానికి నష్టం వాటిల్లింది. ఆ కర్మాగారానికి అనుబంధంగా ఉన్న చెరకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంత చెరకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఆ కర్మాగార నిర్వహణ బాధ్యతలను విశాఖ డెయిరీకి అప్పగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని మంత్రి పుల్లారావు తెలిపారు. చక్కెర కర్మాగారం నిర్వహణ, పెట్టుబడులు పెట్టి నిర్వహించేందుకు ముందుకు వస్తే అప్పగించమని సిఎం చెప్పారని తెలిపారు.