ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దు చారిత్రాత్మకం - పురంధ్రీశ్వరి హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, నవంబర్ 9: ప్రధాని నరేంద్రమోదీ 500,1000 నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్మ్రాకమని కేంద్రమాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ మహిళామోర్చా ఇన్‌చార్జీ దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. బుధవారం ఒంగోలులో జిల్లాపార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవటం హర్షణీయమన్నారు. దేశంలో ప్రజలందరికి ఉపయోగపడేవిధంగా నిర్ణయం తీసుకున్నారన్నారన్నారు. 17 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని ఇతర దేశాల్లో దాచుకున్నారని కేంద్రప్రభుత్వం వారికి గతంలోనే అవకాశం ఇచ్చినప్పటికి దాచుకున్నవారు సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. కేవలం 60వేల కోట్లరూపాయలు మాత్రమే కొంతమంది వ్యక్తులు బయటకు తీసుకువచ్చి ట్యాక్స్‌లు కట్టారన్నారు.