ఆంధ్రప్రదేశ్‌

11మంది డిఎస్పీల బదిలీ డిజిపి ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 12: ఊహించినట్లుగానే రాష్ట్రంలో 11మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ప్రధానంగా విశాఖపట్నం పోలీసు కమిషనరేట్, విశాఖ జిల్లా, అదేవిధంగా ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేస్తున్న అధికారులకు స్థానం చలనం కలిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపిఎస్పీ ఆరో బెటాలియన్‌తో కలిపి మొత్తం 11 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో కొందరికి సబ్ డివిజన్ పోలీసు అధికారులుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా విజయవాడ పోలీసు కమిషనరేట్‌లోని ఈస్ట్ డివిజన్ ఏసిపికి ఈ బదిలీల్లో స్థానం చలనం కలగడం గమనార్హం. బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటిలిజెన్స్ డిఎస్పీగా పని చేస్తున్న బివిఎస్ నాగేశ్వరరావును విశాఖపట్నం కమిషనరేట్‌కు బదిలీ చేస్తూ మధురవాడ ఏసిపిగా నియమించారు. అదేవిధంగా ఏసిబి డిఎస్పీగా పని చేస్తున్న పి రామచంద్రరావును విశాఖపట్నం కమిషనరేట్‌లోనే కొత్తగా రూపొందించిన ద్వారకా జోన్ ఏసిపిగా నియమించారు. గతంలో విజయవాడ సెంట్రల్ ఏసిపిగా పని చేసి ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డిఎస్పీగా ఉన్న టిటి ప్రభాకర్‌బాబును శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్‌గా నియమించారు. ఇంటిలిజెన్స్‌లోనే పని చేస్తున్న మరో డిఎస్పీ వివి భాస్కర్‌ను విజయవాడ పోలీసు కమిషనరేట్ ఈస్ట్ జోన్ ఏసిపిగా నియమిస్తూ ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న బి విజయ భాస్కర్‌ను ఇంటిలిజెన్స్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం మహేంద్రను విశాఖ జిల్లా పాడేరు సబ్ డివిజన్ పోలీసు అధికారిగా నియమించారు. రాయలసీమలోని కల్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీసు అధికారిగా పని చేస్తున్న పి అనిల్‌కుమార్‌ను విశాఖ జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ పోలీసు అధికారిగా బదిలీ చేశారు. తిరుపతి అర్బన్ ట్రాఫిక్ డిఎస్పీగా పని చేస్తున్న ఓ దిలీప్ కిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పోలీసు అధికారిగా బదిలీ చేశారు. అదేవిధంగా వెయిటింగ్‌లో ఉన్న డిఎస్పీ ఏటివి రవికుమార్‌కు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సబ్ డివిజన్ పోలీసు అధికారిగా పోస్టింగ్ కల్పించారు. ఏసిబి డిఎస్పీ కె రంగరాజును విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ పరిధిలోని హార్బర్ ఏసిపిగా నియమించారు. గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పని చేస్తున్న ఎం అరుణ్ బోస్‌ను మంగళగిరి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వుల మేరకు వెంటనే సదరు అధికారులు ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్త స్థానాల్లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.