ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు ముందే తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వం శాస్ర్తియ ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశ ప్రజలు అల్లాడుతున్నారని, పెద్ద నోట్ల రద్దు గురించి ఏపి సిఎం చంద్రబాబుకు ముందే తెలుసని, నాలుగు నెలల్లో లక్ష కోట్ల నల్లధనాన్ని తెలుపు చేసుకున్నారని వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు చంద్రబాబుకు ఎలా తెలిసిందని నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబుపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకోవడానికి బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం తిండితిప్పలు మానుకొని పడిగాపులు కాస్తున్నారన్నారు. కోట్లాది మంది బ్యాంకులు, ఏటిఎంల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు దొరకడం లేదని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లును తగలబెట్టినట్టు శాస్ర్తియ ఆలోచన చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలుగుదేశం నేతలు తమ నల్ల ధనాన్నంతా తెల్లధనంగా మార్చుకున్నారన్నారు. దీనిపై సిబిఐచే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలన్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటే, 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి భారతదేశం ఒక విషాద ఘంటికలోకి వెళ్లిపోయిందన్నారు. సామాన్య ప్రజల విలువైన సమయం వృథా అవుతోందని, పెద్ద నోట్ల రద్దుతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయన్నారు. 50 కోట్ల పనిగంటల సమయం దేశ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కాకుండా నిరుపయోగమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొందరు మాత్రమే లబ్ధి పొందారని, దేశ ప్రజలు అవమానపడేలా ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఎవరినో కొంతమంది నల్లధనం దాచుకున్న వారిని వెలికి తీసేందుకు కోట్లాది మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.