ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్ర ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, నవంబర్ 13: కాపులకు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా తాను నిర్వహించనున్న పాదయాత్రను ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ప్రభుత్వానికి అనుమానం ఉంటే అనుమానం ఉంటే తనకు యాత్రలో పాల్గొనే సహచరులకు పోలీసుల చేత బేడీలు వేయించైనా, యాత్రకు సహకరించాలని ముద్రగడ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. విపక్ష నేతలుగా రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి తదితరులంతా పాదయాత్రలు నిర్వహించినపుడు లేని అభ్యంతరం తమ జాతి కోసం తాను జరుపుతుంటే ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. తామేమైనా తీవ్ర వాదులమా?.., దొంగలమా?..పాదయాత్ర చేసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. కిర్లంపూడితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోను పోలీసు పటాలాన్ని దింపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారూ..ఎన్నికలకు ముందు మీరు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలే ప్రస్తుతం తాను చేస్తున్న పాదయాత్రకు కారణమని’ ముద్రగడ పేర్కొన్నారు. ఇచ్చిన హామీ అమలు కోరితే మీ సంగతి చూస్తాననడం, ఆందోళనకు దిగితే పోలీసులతో కొట్టించడం, తిట్టించడం..ఇదేనా మీ పాలనాతీరు’ అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ పాదయాత్ర చేశారని, ఓదార్పు పేరిట వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిలమ్మ పాదయాత్ర చేశారని, హక్కుల కోసం వామపక్షాలు పలుమార్లు పాదయాత్రలు నిర్వహించాయని ముద్రగడ గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సైతం పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నించారు. ఇటీవల విజయవాడలో కాపు యువత జాబ్‌మేళాలో డిగ్రీలు, పిజీలు చేసిన వారిని మూడు నాలుగువేల జీతాలకు వెళ్లమని సూచించి, ఇంత తక్కువ జీతమా అని ప్రశ్నించిన కాపు యువతను పోలీసులచేత లాఠీలతో కొట్టించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాపు పాదయాత్ర శాంతి భద్రతలకు విఘాతమని డిజిపి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల్లో 30మంది భక్తులు బలికావడానికి కారకులయ్యారని, అప్పుడు గుర్తురాని శాంతిభద్రతలు కాపు సత్యాగ్రహ యాత్ర సమయంలోనే గుర్తుకు రావటం విడ్డూరమన్నారు. తునిలో రైలు దగ్ధం, పోలీసు స్టేషన్ దగ్ధం తదితర ఘటనల్లో కాపులకు సంబంధం లేదని స్పష్టంచేశారు. సిఎం చంద్రబాబు ఈ దుర్ఘటనలకు బాధ్యులని, అవకాశమిస్తే తాను విచారణలో వివరిస్తానన్నారు. చంద్రబాబు పదవీ కాలం ముగిసేంత వరకు రాష్ట్రంలో సెక్షన్ 30 అమల్లో ఉంచుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులూ రావని రాసివ్వమని కోరుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ యాత్రలో వివిధ దుర్ఘటనలు జరిపిస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఏది జరిగినా కాపు జాతికి అంటగడుతున్నారని, అందుకే మా చేతులకు బేడీలు వేస్తే మా తరపునుండి చిన్న తప్పు కూడా జరగదనే భరోసా ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ముందు కాపు జెఎసి నాయకులతో ముద్రగడ గంట సేపు చర్చించారు. విలేఖర్ల సమావేశంలో కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, తోట రాజీవ్, నల్లా విష్ణు, మిండుగండి మోహన్, కలవకొలను తాతాజీ, గౌతు స్వామి, పలువురు జెఎసి నేతలు పాల్గొన్నారు.