ఆంధ్రప్రదేశ్‌

మహిళల రక్షణకు త్వరలో ‘అభయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 13: రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం త్వరలో అభయ యాప్‌ను అన్ని జిల్లాల్లో ప్రవేశపెడుతున్నట్లు డిజిపి నండూరి సాంబశివరావు వెల్లడించారు. ఆదివారం ఒంగోలులోని ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత విశాఖపట్నంలో ఈ యాప్‌ను వినియోగించామని, దీనిని త్వరలో రాష్టవ్య్రాప్తంగా విస్తరింప చేయనున్నట్లు తెలిపారు. రాష్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు త్వరలో యాక్సిడెంటల్ జోన్ అలర్ట్ యాప్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఏటా 24 వేల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల వల్ల ఎనిమిది వేల మంది చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. రోడ్డుప్రమాదాల నివారణకు టెక్నాలజీ జియో వస్తుందన్నారు. ఈ విధానం వల్ల వాహనదారుడు రోడ్డుప్రమాదాల జోన్‌లోకి వెళ్లినప్పుడు హెచ్చరిస్తుందని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు లేరని, అందువల్ల ప్రజలు పిక్నిక్‌లకు కూడా వెళ్లవచ్చన్నారు. ఏఓబి ఎన్‌కౌంటర్‌పై వస్తున్న వందతులు వాస్తవం కాదని, మావోయిస్టులు కాల్పులు జరిపిన తరువాతనే తాము కాల్పులు జరిపామని ఆయన తెలిపారు. తమ అదుపులో గిరిజనులు ఎవ్వరు లేరని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు పోలీసులను మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.