ఆంధ్రప్రదేశ్‌

ఎవరైనా అనుమతి తీసుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ముద్రగడ అయినా, ఎవరైనా సరే ఏదైనా ఆందోళన కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందేనని, ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద కోటి కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే పాదయాత్రలంటూ ఆందోళన చేపట్టడం తగదన్నారు. అనుమతి తీసుకోవాలని, అంతకంటే ముందు ఏదైనా జరిగితే తానే బాధ్యత వహిస్తానని బైండోవర్ కూడా ఇవ్వాల్సివుందన్నారు. చట్ట ప్రకారం అనుమతి తీసుకోకుండా బేడీలు వేసి తీసుకెళ్ళండి అంటూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం ముద్రగడకు తగదన్నారు. తునిలో ఇటువంటి ఆందోళనకు దిగడంతోనే కేసులు నడుస్తున్నాయన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దశాబ్దాలుగా కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నవారిలో ముద్రగడ ఒకరని, అంతమాత్రం చేత కాపులను ఏదో ఉద్దరిస్తున్నట్టుగా వ్యహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు.