ఆంధ్రప్రదేశ్‌

మైదుకూరులో దంపతుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదుకూరు, మార్చి 29: కడప జిల్లా మైదుకూరు పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పట్టే అయ్యవారయ్య (40), పట్టే నాగులు (35) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మైదుకూరులోని సాయినాథపురం రేణుకాయల్లమ్మ గుడి సమీపంలో అయ్యవారయ్య అలియాస్ అయ్యవారురెడ్డి, తన తల్లిదండ్రులు పెద్ద నరసింహులు, వెంకటసుబ్బమ్మ, భార్య నాగులు, కూతురు చంద్రలేఖ, కుమారుడు వెంకటేష్ కలిసి నివాసం ఉంటున్నారు. కూతరు బిటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా వెంకటేష్ పదవ తరగతి చదువుతూ పరీక్షలు రాస్తున్నాడు. వీరు పాత దుస్తుల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. సోమవారం రాత్రి అయ్యవారురెడ్డి భార్యతో కలిసి ఇంటిపై నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో వచ్చి గాఢనిద్రలో వున్న వారిద్దరినీ అత్యంత కిరాతకంగా నరికి పారిపోయారు. ఆ సమయంలో వారు పెట్టిన చావు కేకలు విని ఇంట్లో నిద్రిస్తున్న తాను మిద్దెపైకి వెళ్లే చూడగా తన మూడవ తమ్ముడు చిన్న నరసింహులు, అతడి కుమారుడు శ్రీను, మరికొందరు కలిసి తన కొడుకు, కోడలిని వారు కత్తులు, గొడ్డళ్లతో నరుకుతున్నారని, ఇది చూసిన తాను పెద్దఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారందరూ రావడంతో దుండగులు పారిపోయారని అయ్యవారయ్య తండ్రి పెద్దనరసింహులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ్ముడు చిన్న నరసింహులు కుమారుడు శ్రీను జులాయిగా తిరుగుతూ వుండేవాడని, పాత గుడ్డల వ్యాపారంతో తమ కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయయన్నారు. డీఎస్పీ రామకృష్ణయ్య, అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు దారుణ హత్య దుఃఖాన్ని దిగమింగుకుని వెంకటేష్ మంగళవారం పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.

ఆన్‌లైన్ మోసగాడి అరెస్టు
చీరాల, మార్చి 29: దేశ వ్యాప్తంగా అనేక మందిని ఆన్‌లైన్‌లో మోసం చేస్తున్న ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను టుటౌన్ సి ఐ పరంధామయ్య మంగళవారం విలేఖరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు చీరాలకు చెందిన పి వెంకటేష్ విదేశాల్లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్ ద్వారా తనను సంప్రదించిన వ్యక్తిని నమ్మి అతని బ్యాంకు అకౌంట్‌లో రూ.2.50లక్షలు జమ చేశాడు. కొన్ని రోజుల తరువాత తాను మోసపోయానని గుర్తించిన అతను గత సంవత్సరం నవంబర్ 4న టుటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంకటేష్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌కుమార్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 3 నెలల పాటు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి చివరకు నిందితుడిని అరెస్టు చేశారు.