ఆంధ్రప్రదేశ్‌

వాళ్లకు బుద్ధుండాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: పెద్దనోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసి తాను నల్లధనాన్ని తెలుపు చేసుకున్నానంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలకు అసలు బుద్ధి ఉందా?.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలోనే తాను ముందుగా ఈ డిమాండ్ చేశానని గుర్తుచేశారు. పెద్దనోట్ల రద్దు, తదనంతర పరిణామాల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే తమ తక్షణ కర్తవ్యమని బాబు స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకుంటూనే భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఆయనన్నారు. నోట్ల రద్దుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులతో స్థానిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించి అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టిన టోకెన్ల విధానం ప్రజలకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇలాంటి విధానాలను రాష్టవ్య్రాప్తంగా అమలు చేయడానికి తగిన అవకాశాలు పరిశీలించాల్సిందిగా అధికారులకు ఆయన సూచించారు. రూ.500 నోట్లను ముంబయి, భోపాల్ తదితర కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విడుదల చేశారన్నారు. మన రాష్ట్రానికీ కేటాయింపులు జరిపి చిల్లర సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రూ.50, రూ.100 నోట్ల కొరత తీవ్రంగా ఉందనేది వాస్తవమని, ఇందుకు పరిష్కారంగా జిల్లాలో నగదు కొరతను అధిగమించడానికి ‘కరెన్సీ చెస్ట్’ ద్వారా సమన్వయపర్చుకోవాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. రూ.2వేల నోటుకు చిల్లర దొరికే పరిస్థితి లేదని, ప్రస్తుతానికి కొత్త రూ.500 నోటు త్వరగా చలామణిలోకొస్తే ఈ సమస్య కొంతవరకు తీరుతుందని తెలిపారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి రూ. 2.50 లక్షలు బ్యాంకులో వేసుకునే అవకాశముందని, నీతి నిజాయితీతో కూడిన ఆదాయంపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఏపిలో 6,700 కోట్లు డిపాజిట్ అయ్యాయని, 6,500కోట్ల విలువైన కొత్తనోట్లు చలామణిలోకి వచ్చాయని అధికారులు వివరించారు. నిత్యావసర సరకుల ధరలు పెరగలేదని, ఈ విషయంలో నిర్ధిష్టమైన సమాచారం ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. అలాంటి సంఘటనలు జరిగితే పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.