ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో, సాగుచేసే పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇస్రో సాంకేతిక బృందం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ గవర్నెన్స్ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సి ఉందన్నారు. భూ సంబంధ, వ్యవసాయ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలుచేయడంలో శాటిలైట్, ఆయా ప్రాంత స్థితిగతులు, భూసార విలువలు, వేసే పంటలు, తదితర అంశాలు కీలకమన్నారు.
ఇప్పటికే ఒడిశాలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధానాల్లో చేపడుతున్న చర్యలను వివరించారు. ఎపి స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో ఉపగ్రహం ద్వారా ఖరీఫ్, రబీ పంటల వాస్తవ దిగుబడులను అంచనా వేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎపి సెక్ వైస్ చైర్మన్ ఆర్వీ రమణ, శాస్తవ్రేత్త డాక్టర్ టి నరేంద్రబాబు, ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రతినిధి సిఎస్ మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.