ఆంధ్రప్రదేశ్‌

మరీ ఇంత నిర్లక్ష్యమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, నవంబర్ 17: అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలోఉన్న రోగిని వార్డులో చేర్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకరించలేదు. కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వండని ప్రాధేయపడినా వారు స్పందించలేదు. దీంతో చేసేది లేక భర్తను భార్యే ర్యాంప్‌పై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వార్డులో చేర్పించింది. ఈ హృదయ విదారక సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన శ్రీనివాసాచారికి పెరాలసిస్ వ్యాధి సోకడంతో నడవలేకపోతున్నాడు. ఇటీవల కడుపులో నొప్పి తీవ్రం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. బుధవారం వ్యాధి తిరగబెట్టడంతో భార్య శ్రీవాణి సాయంతో ఆసుపత్రికి వచ్చాడు. ఓపిలో చూపించగా వార్డులో చేర్పించాలని వైద్యులు తెలిపారు. దీంతో పై అంతస్థులో ఉన్న వార్డులో చేర్చేందుకు సహకరించమని శ్రీవాణి సిబ్బందిని కోరగా వారు స్పందించలేదు. కనీసం స్ట్రెచర్ అయినా ఇస్తే తానే తోసుకుంటూ వెళ్తానని కోరినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేవు వేచిచూసిన ఆమె చేసేది లేక చివరకు ర్యాంపై భర్తను ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో శ్రీనివాసాచారి పెడబొబ్బలు పెట్టగా అక్కడే ఉన్న సిబ్బంది, జనం మానవత్వం లేని మనుషుల్లా చూస్తుండిపోయారే తప్ప సాయం చేసేందుకు ముందుకురాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇజంతకర్ చంద్రశేఖర్ గురువారం ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆసుపత్రి ఎస్‌ఎఫ్‌ఓ, సిబ్బందిని మందలించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

చిత్రం.. భర్తను ర్యాంప్‌పై ఈడ్చుకుంటూ వెళ్తున్న భార్య శ్రీవాణి