ఆంధ్రప్రదేశ్‌

ఒక మెట్టు దిగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు/ రాజమహేంద్రవరం/ కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష రెండోరోజు మరింత సెగ పుట్టించింది. ఆందోళనలు ఉధృతం కాకుండా ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికను అనుసరిస్తుంటే, డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ ప్రకటిస్తున్నారు. అయితే, కాపు సామాజిక వర్గీయులకు మేలు జరుగుతుందంటే మెట్టు దిగేందుకు తాను సిద్ధమేనని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చాలని, కాపు కార్పోరేషన్‌కు 2వేల కోట్లు కేటాయించాలని, తుని ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలనే డిమాండుతో ముద్రగడ, ఆయన సతీమణి పద్మావతితో కలసి చేపట్టిన ఆమరణ దీక్ష రెండోరోజుకు చేరింది. కాపులకు మేలు జరుగుతుందంటే డిమాండ్లలో కొద్దిపాటి సవరణలు చేస్తాం తప్ప, డిమాండ్ల ఆమోదం లేకుండా దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇదిలావుంటే, ముద్రగడ దీక్షకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో రెండోరోజూ ఆందోళనలు కొనసాగాయి. మధ్యాహ్న సమయంలో కాపు వర్గీయులు, మహిళలు, పిల్లలు సహా రోడ్డెక్కి ఖాళీ కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనేకచోట్ల ఆమరణ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అయితే, దీక్షా శిబిరాలు విస్తరించకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. సెక్షన్ 30, 144 సెక్షన్ అమల్లో ఉండటంతో దీక్షా శిబిరాలు, ఆందోళనకు దిగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇదిలావుంటే, విశాఖలో ఇంటర్నేషన్ ఫ్లీట్ రివ్యూ పూర్తయ్యే వరకూ ముద్రగడ దీక్షపై పోలీస్ చర్యకు దిగకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
వైద్య పరీక్షలకు నిరాకరణ
ముద్రగడ ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరడంతో, శనివారం ఉదయం 7 గంటలకు వైద్యులు దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం మళ్ళీ వైద్యులురాగా పరీక్షలకు ముద్రగడ నిరాకరించారు. పద్మావతి ఆరోగ్యం క్షీణించటంతో, ఆమె పడుకునే దీక్షను కొనసాగిస్తున్నారు.

చిత్రం... ఆమరణ దీక్షలో కూర్చునే సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్న ముద్రగడ