ఆంధ్రప్రదేశ్‌

అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన పౌర సరఫరాల అధికారులతో అన్న క్యాంటీన్లపై సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సామాన్యులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకే అందించాలని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లను ఉత్తమ ప్రమాణాలతో నిర్వహించేందుకు వీలుగా తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను పరిశీలించాలని ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చర్చించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాలను రిటైల్ కిరణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలని సిఎం ఆదేశించారు. నిత్యావసర వస్తువులు అన్ని ఓకే చోట లభించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. డ్వాక్రా, మెప్మా, ఎస్సీ, బిసీ, తదితర కార్పొరేషన్ల సహకారంతో నడిచే సంస్థల ఉత్తత్తులను విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతుల కోసం కేంద్రానికి లేఖ
సహకార బ్యాంకులలో రైతుల బకాయిల చెల్లింపునకు పాత నోట్లు తీసుకునేందుకు అనుమతించేలా కేంద్రాన్ని కోరాలన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దీనిపై తాను కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. ఇప్పటికే టిడిపి ఎంపిలు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లిన విషయం గుర్తు చేశారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్ల మార్పిడిపై రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘నీరు-ప్రగతి’పై చూపిన శ్రద్ధ కారణంగానే రాష్ట్రంలో 28% వర్షపాతం లోటు ఉన్నప్పటికీ వ్యవసాయం, అనుబంధ రంగాలలో 25% వృద్ధి సాధించగలుగుతున్నట్లుగా చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మేలైన విధానాల అమలు, సకాలంలో ఆర్థిక సమస్యలను పరిష్కరించడం, వివిధ శాఖల మధ్య పరస్పర సహకారం వల్లే ఇది సాధ్యం అయ్యిందన్నారు.