ఆంధ్రప్రదేశ్‌

సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పరిస్థితిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ఒక ఎమర్జెన్సీలా భావించి సహకరించాలని ఆర్‌బిఐ, మొబైల్ ఆపరేటర్లు, తపాలా, బ్యాంక్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నప్పుడు స్వలాభాన్ని చూసుకోకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లేదంటే వారి పట్ల కూడా ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటి వరకూ పరిస్థితులను పరిశీలించామని, బ్యాంక్‌లు, ఆర్‌బిఐ ఏమి చేస్తున్నాయో చూశామన్నారు. ఇక కార్యాచరణ మరింత వేగంగా ఉంటుందని, మరో నాలుగైదు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థాయికి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్‌లో ఉండి పరిస్థితి సమీక్షించాలన్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు, మహిళలకు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొంతమంది బాధ్యతా రాహిత్యం వల్ల రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయని, అవి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఎపిని ఒక శాఖలా కాకుండా, ఒక ప్రధాన శాఖగా గుర్తించాలని ఆర్‌బిఐని కోరారు.