ఆంధ్రప్రదేశ్‌

సిమ్స్ సేవలు అమోఘం : నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 20 : ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యసేవలు అమోఘమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా కొనియాడారు. అనంతపురం జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా హాజరై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యాన్ని తలదనే్నలా ఆధునిక అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఈ ఆసుపత్రిలో పేద ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. 1991లోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడం సత్యసాయికే సాధ్యమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 11 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నాలుగైదేళ్ల కాలంలో నిర్మించగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏడాదిలోపు నిర్మించడం అరుదైన విషయమన్నారు. బాబా బోధించిన ప్రేమ, సేవాతత్వం మార్గదర్శకంగా ఇక్కడి వైద్యులు ప్రేమ, దయ, కరుణ కలిగి అంకితభావంతో రోగులకు వైద్యసేవలు అందించడం ఆదర్శప్రాయమన్నారు. ఇప్పటివరకూ 43 లక్షల మందికి వైద్యసేవలు అందించగా 2.5 లక్షల మందికి అతి ఖరీదైన శస్తచ్రికిత్సలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుపేద ప్రజలు వైద్యం పొందుతున్నారంటే వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతమన్నారు. బాబా భౌతికంగా లేనప్పటికీ సత్యసాయి ట్రస్టు వైద్యసేవలను కొనసాగించడం బాబా ఆశయ సాధనకు నిదర్శనం అన్నారు. ఇక్కడి వైద్య సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎబిహెచ్(నేషనల్ అక్రిడేషనల్ బోర్డు) అవార్డును సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆ అవార్డును ఎన్‌ఎబిహెచ్ సభ్యులు డాక్టర్ రానా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ గురుమూర్తికి ప్రదానం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు జనరల్ ఆసుపత్రి, సంచార వైద్యం, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వైద్య శిబిరాల ద్వారా సత్యసాయి పేరిట ఎందరికో అందిస్తున్నారన్నారు. అనంతరం కేంద్ర మంత్రి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ రోగులకు అందిస్తున్న వైద్యసేవలను అభినందించారు. విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యులు కృష్ణారెడ్డి, నీలం దేశాయ్, అయ్యర్, రాఘవరెడ్డి, కృష్ణదాసులకు అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర మంత్రి వెంట ట్రస్టు సభ్యులు ఆర్‌జె రత్నాకర్, విశ్రాంత డిజిపి హెచ్‌జె దొర, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.

చిత్రం.. సిమ్స్ రజతోత్సవంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి జెపి నడ్డా