ఆంధ్రప్రదేశ్‌

రైతులు, చిల్లర వ్యాపారులను ఆదుకోవాలి: బుగ్గన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రం రద్దుచేసిన పెద్ద నోట్ల వల్ల ఆంధ్రలో రైతులు దెబ్బతిన్నారని, చిల్లర వ్యాపారం ధ్వంసమైందని, దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు డబ్బులు ఎందుకని, కార్డులే ఉపయోగించాలని అంటున్నారని, నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లేమి గల రాష్ట్రంలో ప్రజలు ఎలా కార్డులు ఉపయోగిస్తారన్నారు. నోట్ల రద్దుకు పది రోజుల ముందే చంద్రబాబు తన షేర్లను అమ్ముకున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చార్జిషీట్‌లో బాస్ అనే పేరు 32 సార్లు నమోదైందని, బాస్ అంటే ఎవరని ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, నోట్ల రద్దుకు రెండు రోజుల ముందు హెరిటేజ్ షేర్లు అమ్మేయడం వంటి పరిణామాలు చూస్తే చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డుల విధానం మంచిదన్నట్లు చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వడమేంటన్నారు.