ఆంధ్రప్రదేశ్‌

అనంతలో జెసి దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 21: అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే, నగర మేయర్ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సోమవారం చేపట్టిన నిరసనదీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఉదయం నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట ఎంపి నిరసనదీక్ష ప్రారంభించారు. నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని, రోడ్లను విస్తరించాలని డిమాండ్ చేశారు. తాను ఈ పనులు చేస్తుంటే ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, నగర మేయర్ స్వరూప అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మీరు ఎంపికి సహకరిస్తే ఎసిబి కేసులు పెట్టిస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తూ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తమకు సహకరించకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా పాతవూరులోని తిలక్‌రోడ్డు, గాంధీబజార్ రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. దీంతో తానే ప్రభుత్వం నుంచి రూ.70 కోట్ల నిధులు మంజూరుచేయించానన్నారు. ఖర్చు చేయకపోవడంతో నిధులు గత 11 నెలలుగా మురిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దీక్ష విరమించాలని మున్సిపల్ అధికారులు నచ్చజెప్పినా దివాకర్‌రెడ్డి వినిపించుకోలేదు. ఎంపిని పరీక్షించిన వైద్యులు షుగర్ లెవెన్స్ పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పోలీసులు శిబిరంలోకి చొరబడి ఎంపిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. జెసిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు దివాకర్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు.
సిఎం వద్దన్నా...
నిరసన దీక్ష చేపడుతానని మూడు రోజుల క్రితం దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా దీక్ష చేయవద్దని జిల్లా నేతల ద్వారా ఎంపికి సూచించారని సమాచారం. ఆదివారమే ఆ మేరకు కబురుపెట్టారని తెలుస్తోంది. సిఎం వద్దని వారించినా దివాకర్‌రెడ్డి సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. దీంతో సిఎం దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.