ఆంధ్రప్రదేశ్‌

బాధితులకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 22: దివీస్ మందుల కంపెనీని ప్రజా నిరసనల మధ్య బలవంతంగా నిర్మించిన పక్షంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని తొలగిస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. దివీస్ యాజమాన్యం తక్షణం నిర్మాణ పనులు మానుకుని వేరేచోటకు తరలిపోవాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన నిలబడి, పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం దివీస్ మందుల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభకు జగన్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున దివీస్ బాధితులు ఈ బహిరంగ సభకు తరలిరాగా జగన్ ప్రసంగించారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, ప్రాంత ప్రజలకు అండగా ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటైతే ఈ ప్రాంతమంతా కాలుష్య భరితంగా మారిపోతుందన్నారు. పరిశ్రమ ఏర్పాటైతే 65 లక్షల లీటర్ల నీటిని పరిశ్రమకు ఉపయోగిస్తూ, అందులో 55 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను తిరిగి సముద్రంలోకి విడిచిపెడతారని హెచ్చరించారు. ఈ ప్రాంత మత్స్యకారులంతా వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ చాలా కాలంగా హేచరీలను అభివృద్ధి చేశారని, వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందన్నారు. హేచరీలకు కూడా మెడికల్ కంపెనీ ఏర్పాటుతో తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.5 లక్షలు చెల్లించి సుమారు 670 ఎకరాలను దివీస్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిందని విమర్శించారు. చిన్న సన్నకారు రైతుల నుండి ఎకరం, రెండెకరాల భూములను బలవంతంగా లాక్కుని దివీస్ కంపెనీకి కట్టబెట్టడం ఎంత వరకు సమంసమని ప్రశ్నించారు. గత 82 రోజులుగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, పోలీసు బలగాలను రంగంలోకి దించారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. బాధితుల పక్షాన పోరాడుతున్న తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై 22 అక్రమ కేసులను పోలీసులు నమోదు చేశారని, అందులో 7 హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. మహిళలని చూడకుండా బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్‌లు చేస్తున్నారని, 82 రోజులుగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను ఎందుకు విధించాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. బహిరంగ సభ వేదికపై ఈ ప్రాంతానికి చెందిన సుమారు పది మంది బాధితులతో దివీస్ ఫ్యాక్టరీ కారణంగా ఎదురైన సమస్యలపై మాట్లాడించారు. సభకు జిల్లా వైసిపి అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దివీస్ ఫ్యాక్టరీ బాధితులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

చిత్రం.. దివీస్ బాధితులు ఈ బహిరంగ సభకు హాజరైన వైఎస్ జగన్