ఆంధ్రప్రదేశ్‌

నేడే గూడెంలో అమిత్ షా రైతు సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 25: కేంద్రంలో అధికారం చేపట్టిన తమది రైతు అనుకూల ప్రభుత్వమని చాటిచెప్పడంలో భాగంగా బిజెపి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతు మహాసభను నిర్వహిస్తోంది. సుమారు లక్షమంది రైతులు తరలివస్తారని అంచనావేస్తున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరువుతున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకువస్తున్న పథకాలు, వాటి ఫలితాలను రైతులకు వివరించే ప్రధాన లక్ష్యంతో ఈ రైతు మహాసభను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నియోజకవర్గంలో విమానాశ్రయ భూముల్లో ఈ సభను నిర్వహించనున్నారు. రైతు మహాసభ కావడంతో జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకునే అమిత్ షా రైతులతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు. సభలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ కూడా పాల్గొంటారు. అలాగే జిల్లాకు సంబంధించి ప్రధాన సమస్యగా వున్న కొల్లేరు అభయారణ్యం కాంటూరు కుదింపు అంశం కూడా సభలో చర్చకు రానుందని సమాచారం.

చిత్రం... రైతు మహాసభ ఏర్పాట్లపై చర్చిస్తున్న మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు