ఆంధ్రప్రదేశ్‌

అరకోటి విలువైన వెయ్యి నోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 26: చెన్నైనుంచి రూ.అర కోటి విలువైన వెయ్యి రూపాయల నోట్లను మార్చేందుకు రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డిఎస్పీ (జిఆర్‌పి) లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పెద్దనోట్ల శనివారం కస్టమ్స్ అధికారి పి పాండురంగారావుతో కలిసి డిఎస్పీ సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరం నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో తాడేపల్లిగూడెం వరకు వెళ్లి తిరిగి బొకారో ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేస్తూ గోదావరి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో బొకారో ఎక్స్‌ప్రెస్ నుంచి ఒక వ్యక్తి బ్యాగ్‌తో రైలు దిగాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో సోదా చేయగా బ్యాగ్‌లో రూ.50 లక్షల విలువైన 50 కట్టల రద్దుచేసిన రూ.వెయ్యి నోట్లు దొరికాయి. విచారణలో అతడు చెన్నైలోని న్యూటెక్ నిర్మాణ సంస్థలో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న మథియ అలగన్ అని గుర్తించారు. ఈసందర్భంగా రాజమహేంద్రవరంలో సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తికి ఈసొమ్మును అందజేయడానికి వచ్చినట్టు అలగన్ చెప్పాడు. తమ సంస్థ అధినేత నాగిరెడ్డి సూచనల మేరకే రద్దు చేసిన పాత వెయ్యి నోట్లను మార్చేందుకు రాజమహేంద్రవరం వచ్చినట్లు అలగన్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అలగన్‌ను నగదుతో సహా రైల్వే పోలీసులు ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఆదాయపుపన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఆదిత్య, ఆయన సిబ్బంది అలగన్‌ను విచారిస్తున్నారు. కాగా అతడిచ్చిన సమాచారం ఆధారంగా ఆదాయపుపన్ను శాఖ అధికారులు నాగిరెడ్డిని విజయవాడలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
చిత్రం...
స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు చూపిస్తున్న
రైల్వే డిఎస్పీ లక్ష్మీనారాయణ