ఆంధ్రప్రదేశ్‌

మెట్రో రైల్‌కు టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 28: విజయవాడ నగరానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మెట్రోరైలు టెండర్ల దశకు చేరింది. సుమారు 1800 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఫేజ్‌ల నిర్మాణానికి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ టెండర్ల ప్రక్రియకు కసరత్తు చేస్తోంది. రూ. 969 కోట్ల వ్యయంతో మొదటి ఫేజ్‌లో పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి నిడమానూరు వరకు, రెండో ఫేజ్‌లో రూ. 831 కోట్ల వ్యయంతో పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ మార్గాలను నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి ఫేజ్‌కు డిసెంబర్ 5 నుంచి 2017 జనవరి 16 వరకూ, రెండో ఫేజ్‌కు డిసెంబర్ 8 నుంచి 2017 జనవరి 17 వరకూ టెండర్ల దాఖలుకు ముగింపు గడువుకాగా టెండర్లను పారదర్శకతతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదటి ఫేజ్‌లో ఏలూరు రోడ్డును కలుపుతూ బస్టేషన్ నుంచి రైల్వే స్టేషన్, బీసెంట్ రోడ్డు, సీతారామపురం, మాచవరం సిగ్నల్, పడవలరేవు, గుణదల, రామవరప్పాడు రింగ్, ప్రసాదంపాడు, ఎంబిటి సెంటర్, ఎనికేపాడు వరకూ 0.155 కి.మీల నుంచి 13.210 కి.మీల వరకూ ఆయా ప్రాంతాల్లో 13 ఎలివేటెడ్ స్టేషన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు. రెండో ఫేజ్‌లో బందరు రోడ్డును కలుపుతూ పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి విక్టోరియా మ్యూజియం, ఇందిరా గాంధీ స్టేడియం, టిక్కిల్ రోడ్డు, బెంజి సర్కిల్, ఆటోనగర్ గేట్, అశోక్‌నగర్, కృష్ణనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరుకు 0.155 నుంచి 12.390 కి.మీల వరకూ డిజైన్‌తో పాటు 11 ఎలివేటెడ్ స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.