జాతీయ వార్తలు

బాబే సారథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ప్రజా సమస్యల పరిష్కారానికి తగు సూచనలు, సలహాలు అందించి, సముచిత సిఫార్సులు చేసేందుకు ఏపీ సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఐదుగురు సిఎంలతో ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబుతో టెలిఫోన్‌లో మాట్లాడిన అరుణ్ జైట్లీ, ప్రధాని మోదీ ఆలోచనను వివరించారు. చంద్రబాబు నేతృత్వంలోని కమిటీలో మధ్యప్రదేశ్, బీహార్, పాండిచ్చేరి, త్రిపుర సిఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, నితీశ్‌కుమార్, నారాయణ స్వామి, మాణిక్ సర్కార్‌లు సభ్యులుగా ఉంటారు. పెద్ద నోట్లు రద్దు చేసి 20 రోజులు గడుస్తున్నా, కొత్త నోట్ల పంపిణీ సమస్యలు తొలగిపోలేదు. దేశ ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులు, కూలి చేసి జీవించేవారి ఇబ్బందులు వర్ణనాతీతం. కొత్త నోట్ల కొరత కారణంగా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఏంచేస్తే బాగుంటుందనేది చంద్రబాబు కమిటీ సూచించాల్సి ఉంటుంది. అలాగే, వీలైనంత త్వరగా కమిటీ తన సిఫార్సులను ప్రధానికి అందించాల్సి ఉంటుంది. చంద్రబాబు కమిటీ నుంచి సిఫార్సులు అందగానే, వాటిని యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. నరేంద్ర మోదీ గతంలోనూ చంద్రబాబు సేవలను ఉపయోగించుకోవటం తెలిసిందే. మోదీ ప్రధాని పదవి చేపట్టగానే దేశంలో పరిశుభ్రతను నెలకొల్పేందుకు స్వచ్ఛ్భారత్ పథకాన్ని చేపట్టటం తెలిసిందే. స్వచ్ఛ్భారత్ సాధనకు నీతి ఆయోగ్ పరిధిలో చంద్రబాబు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రధాని మోదీ స్వచ్ఛ్భారత్ పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడు కొత్త నోట్ల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరిత గతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను చంద్రబాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ సూచించాల్సి ఉంటుంది.