ఆంధ్రప్రదేశ్‌

మంత్రులు కోరిన గ్రాంట్లకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: వివిధ ప్రభుత్వ శాఖల కింద 2016-17 సంవత్సరానికి గాను గ్రాంట్ల కోసం అభ్యర్థిస్తూ మంత్రులు చేసిన ప్రతిపాదనలకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపాదించిన మేరకు 2016-17 సంవత్సరానికి ఆయా శాఖలకు అవసరమైన మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో వెల్లడించారు. అనంతరం సభ ఆమోదానికి తెలియజేయడంతో అంతా ఆమోదించారు. దీంతో ఆయా మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి అదనపు వ్యయానికి గాను రూ.21,016.20 కోట్లకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. అనంతరం ఈ ప్రతిపాదనను సభలో వెల్లడించి ఓటింగ్ కోరగా ఏకగ్రీవంగా సభ ఆమోదించింది.