ఆంధ్రప్రదేశ్‌

భక్తిశ్రద్ధలతో లక్ష దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 28: పంచారామ క్షేత్రాల్లో అగ్రగామి అమరావతి అమరేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని హిందూ ధర్మరక్షా సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష దిపోత్సవ వేడుకల్లో గుంటూరు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు. తొలుత అమరేశ్వరాలయానికి విచ్చేసిన విశ్వంజీ మహరాజ్‌కు ఆలయ ఇవో శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిపి వెంపా జ్వాలాలక్ష్మీనరసింహారావు పూలమాలలు వేసి, మేళతాళాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం విశ్వయోగి విశ్వంజీ కుటుంబ సమేతంగా కార్తీక దీపాలను వెలిగించారు. ఈసందర్భంగా భక్తులనుద్దేశించి విశ్వంజీ మహరాజ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో నదీస్నానం చేసి దీపాలు వెలిగిస్తే వెన్నంటి ఉన్న ఈతిబాధలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో వర్థిల్లుతారన్నారు. కార్తీక మాసంలో వనభోజనం చేయడం చాలా మంచిదన్నారు. దీపదానం, పితృదానం, శివునికి అభిషేకం, విష్ణువులకు అలంకరణ పుణ్యఫలాలను ఇస్తుందని తెలిపారు. లక్ష దీపోత్సవానికి ముందు అమరలింగేశ్వర భజనమండలి సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు, సహస్ర నామార్చన చేశారు. కార్యక్రమంలో మల్లాది మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భవిరిశెట్టి హనుమంతరావు, స్థానికులు, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించిన విశ్వయోగి విశ్వంజీ