ఆంధ్రప్రదేశ్‌

రైతులకు నూరుశాతం సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 28: రాష్టవ్య్రాప్తంగా వంద శాతం విద్యుత్, వంద శాతం గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లే నూటికి నూరుశాతం సాగునీరు రైతులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. నీరు-ప్రగతిపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పుడు 22 మి.యూనిట్ల విద్యుత్ కొరత ఉన్నప్పటికీ అదనపు ఉత్పత్తితో పాటు ప్రసార, పంపిణీ నష్టాలను నెలరోజుల్లోనే అధిగమించిన విషయాన్ని గుర్తుచేశారు. దీపం పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లను తానే ప్రారంభించిన విషయం ప్రస్తావించి ప్రస్తుతం 100 శాతం కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం నీరు-ప్రగతి ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ 100 శాతం సాగునీటి భద్రత కల్పించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది 29 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ కూడా ముందుజాగ్రత్తల వల్లే వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 26 శాతం పురోగతిలో ఉన్నామన్నారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉందన్నారు. నీరు-ప్రగతి వల్లే నీటి సంక్షోభం నుంచి బయటపడ్డామని, అందుకు సహకరించిన అధికార యంత్రాంగాన్ని, అన్నివర్గాల ప్రజలను ఆయన అభినందించారు. పంట సంజీవని, వనం-మనం, ఎన్టీఆర్ జలసిరిపై మరింత శ్రద్ధ వహించాలని దిశానిర్దేశం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారిందంటూ అదే స్ఫూర్తితో నీరు-ప్రగతిని విజయవంతం చేసి దేశంలోనే రోల్‌మోడల్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వృథాగా పోయే 40 టిఎంసిల గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా ఆయకట్టులో వినియోగించ గలిగామన్నారు. రాయలసీమ జిల్లాలకు 100 టిఎంసిలు కృష్ణా జలాలు ఇవ్వగలిగినట్లు తెలిపారు. ఇప్పటికే 3వేల టిఎంసిల గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోయాయంటూ వీటిని సద్వినియోగం చేసుకుంటే కరవు అనేదే కనిపించదన్నారు. కెసి కెనాల్, హెచ్‌ఎల్‌బిసిలో నీటి కొరతతో అనుకున్న ఫలితాలు రానప్పటికీ హంద్రి-నీవా ద్వారా గుళ్లపల్లి వరకు నీరివ్వటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. గండికోటకు 6వేల క్యూసెక్కులు తీసుకెళ్లాలన్నారు. వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు నీటిని తీసుకెళ్లాలన్నారు. చెర్లోపల్లి, అడవిపల్లి, చిత్తూరు, కుప్పం, మడకశిర వరకు సాగునీటిని అందించగలగాలని అన్నారు. నరేగా నిధులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి పంచాయతీలో కనీసం రూ.కోటి విలువైన పనులు జరగాలని చంద్రబాబు ఆదేశించారు. నరేగా కింద ఈ ఏడాది రూ. 3207 కోట్ల వ్యయ లక్ష్యానికి గాను రూ. 2,222 కోట్లు వ్యయం చేశారన్నారు.