ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఎపి ప్రభుత్వం అన్ని రంగాల్లో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఎపి ప్రభుత్వం ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖల్లో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినట్లు, అక్రమార్జనకు కళ్ళెం పడి అవినీతి తగ్గినట్లు నీతి అయోగ్ ప్రశంసించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సిఆర్‌డిఎ)కు సంబంధించి కూడా సిఎం డ్యాష్‌బోర్డు మాదిరి డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఈ డ్యాష్ బోర్డులో సిఆర్‌డిఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరచారు. ఏపి ఇ - ప్రొక్యూర్‌మెంట్, నా ఇటుక - నా అమరావతి వంటి లింకులను కూడా ప్రధాన వెబ్‌సైట్‌లో ఉంచారు. 8,603 చదరపు కిలోమీటర్ల సిఆర్‌డిఏ పరిధిలో 217 చదరపు కిలోమీటర్లలో నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలి, ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ఎంత సేకరించారు, ఎంత మంది రైతులు భూములు ఇచ్చారు, ఎంత మంది భూమిలేని పేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మాస్టర్ ప్లాన్, టెండర్లు, ఆమోదించిన, ఆమోదించని ప్లాన్లు తదితర వివరాలన్నింటినీ ప్రధాన వెబ్‌సైట్‌లో ఉంచారు. సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఈ డ్యాష్ బోర్డును రూపొందించారు. ప్రధాన వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఇప్పుడు 12 అంశాలను సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఓ డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్పీఎస్), ఒకేసారి రైతుల రుణమాఫీ, భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (బిపిఎస్), అమరావతి స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్ (ఏఎస్‌డిఐ), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆల్‌ఈజీఎస్ - నరేగా), అమరావతి, అమరావతిలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్‌పిపి), బయోమెట్రిక్ హాజరు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, పరిసరాల పచ్చదనం, అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి ఈ డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో మూడు అంశాలు (ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, బయో మెట్రిక్ హాజరు) తప్ప మిగిలిన వివరాలన్నింటినీ అప్‌డేట్ చేశారు. నరేగాకు సంబంధించి మెయిన్ వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు. డ్యాష్‌బోర్డులో తెలిపిన ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 27,625 మంది రైతుల నుంచి 34,095.8322 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,217 మంది రైతుల నుంచి 31,989.5913 ఎకరాలు సమీకరించింది. ఇంకా 2115 మంది రైతుల నుంచి 1175.8978 ఎకరాలు సమీకరించవలసి ఉంది. ఏ గ్రామంలో ఎంత భూమి సమీకరించారో, ఎంత సమీకరించాలో, పట్టా భూమి, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ భూమి తదితర వివరాలు కూడా ఇక్కడ అప్‌డేట్ చేశారు. రూ. 88.67 కోట్ల రుణాలు రద్దు, రైతుల రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. మొత్తం 27 గ్రామాల్లోని 20,355 మంది రైతులకు చెందిన రూ. 88.67 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. గ్రామాల వారీగా వివరాలను కూడా ఇక్కడ ఉంచారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కాకుండా భూసారం ఆధారంగా ఏడాదికి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు పది సంవత్సరాలపాటు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రకారం వార్షిక చెల్లింపుల్లో భాగంగా 31,987.84 ఎకరాలకు 26,776 మంది రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 136.71 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, యూనిట్ల వారీగా పూర్తి వివరాలు ఇందులో ఉంచారు. బిల్డింగ్ పెనలైజేషన్ పథకం కింద సిఆర్‌డిఏకు ఇప్పటి వరకు 6429 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1813 ప్రొసీడింగ్ లెటర్ దశలో ఉన్నాయి. 4491 పరిశీలనలో ఉన్నాయి. 125 దరఖాస్తులను తిరస్కరించారు. వ్యక్తిగతంగా దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోడానికి బిపిఎస్ సైట్ లింక్ కూడా ఇక్కడే ఇచ్చారు. అమరావతి స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా 482 మందికి శిక్షణ ఇప్పించారు. 225 మందికి నేరుగా ఉపాధి కల్పించారు. గ్రామాల వారీగా ఎంతెంత మందికి ఉపాధి కల్పించారో పూర్తి వివరాలు పొందుపరిచారు.