ఆంధ్రప్రదేశ్‌

తుపాను సహాయక చర్యలకు తూర్పు నౌకాదళం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 1: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుపాను నేపథ్యంలో తూర్పు నౌకాదళం సహాయ చర్యలకు సిద్ధంగా ఉందని ఇఎన్‌సి పేర్కొంది. నాడా తుపాను తమిళనాడు, పాండిచ్చేరి సమీపంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడంతో పాటు సహాయ చర్యలకు వీలుగా తూర్పు నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ సత్పుర యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచినట్టు ఇఎన్‌సి అధికారులు తెలిపారు. దాదాపు 5000 మందికి సరిపోయే అత్యవసర మందులతో పాటు నిర్వాసితులకు అవసరమైన ఆహారం, బట్టలు, దుప్పట్లు తదితర సామాగ్రితో రెండు నౌకలు సేవలకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అవసరమైన రబ్బర్ బోట్లు, హెలికాఫ్టర్లు, సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ రంజిత్ బంగాళాఖాతం తీరంలో సిద్ధంగా ఉందని తెలిపారు. తమిళనాడు, పాండిచ్చేరిలకు చెందిన ఐఎన్‌ఎస్ ఫ్లాగ్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయ కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇఎన్‌సి పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తరలించేందుకు నౌకాదళ యుద్ధ విమానాలు రాజాలి, డేగా ఎయిర్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో వర్షాలు
నెల్లూరు/చిత్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడ్డ నాడా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల గురువారం మధ్యాహ్నం నుండి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, గూడూరు డివిజన్లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తడ, సూళ్లూరుపేట మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. చెన్నై సమీపంలో కడలూరు వద్ద తుఫాను తీరం దాటనుంది. దీంతో నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు డివిజన్‌లో తీరప్రాంత అధికారులను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అప్రమత్తం చేశారు. తుఫాను కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే తుఫాన్ బలహీనపడిందని ఆయన తెలిపారు. నాడా తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లావ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. ఈ తుఫాన్‌తో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొన్నాయి. తిరుపతిలో కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రుతుపవనాలు శీతకన్ను
తగ్గిన వర్షపాతం

విశాఖపట్నం, డిసెంబర్ 1: రుతుపవనాలు తెలుగు రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నట్టుంది. ఏడాది కాలంగా సకాలంలో వర్షాలు కురవక రైతన్న దిక్కులు చూస్తున్నాడు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు కూడా రైతన్నకు సహకరించలేదు. రెండు సీజన్లలోనూ వాస్తవంగా నమోదు కావాల్సిన వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతన్న కుంగిపోతున్నాడు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోయింది. నైరుతి రుతు పవనాల సమయంలో రాష్ట్రంలో 826 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 582 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. సీజన్ మొత్తానికి 30 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
పాత నోట్ల మార్పిడి
పేరుతో కుచ్చుటోపీ
వ్యక్తి అరెస్ట్... రూ. 1.18 కోట్ల స్వాధీనం
చిలకలూరిపేట, డిసెంబర్ 1: రద్దయిన నోట్లు ఇస్తానని నమ్మబలికి తెల్లకాగితాలు ఇచ్చిన ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్‌చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తిరుపతి ప్రాంతానికి చెందిన హరీష్ అనే వ్యక్తి రద్దయిన నోట్లను తీసుకుని నూతనంగా చెలామణి అయ్యే నోట్లను ఇచ్చి మోసపోయాడు. చిత్తూరు జిల్లాలోని ఒక ప్రాంతం వద్ద మురళీకృష్ణారెడ్డి అనే వ్యక్తి రద్దయిన పెద్దనోట్లను రెండు సూట్‌కేసుల్లో హరీష్ అనే వ్యక్తికి ఇచ్చి అతని వద్ద నుండి చెలామణి అయ్యే కోటి 40 లక్షల రూపాయలను తీసుకున్నాడు. తదనంతరం హరీష్ అక్కడి నుండి విశాఖపట్నం వెళ్తూ మార్గమధ్యలో సూట్‌కేసు తెరిచి చూసుకోగా దానిలో తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. దీంతో హతాశుడైన హరీష్ మార్గమధ్యంలో దిగి చిలకలూరిపేట అర్బన్ పోలీసుస్టేషన్‌కు వచ్చి తన వద్ద ఉన్న డబ్బును దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అన్నదానం మండపంలో
పేలిన బాయిలర్
శ్రీకాళహస్తి, డిసెంబర్ 1: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అన్నదానం మండపంలో గురువారం స్టీమ్ బాయిలర్ పేలింది. పెద్దశబ్దంతో పేలుడు రావడంతో భక్తులు, దేవస్థానం సిబ్బంది ఆందోళన చెందారు. అన్నదానం పథకానికి భోజనం తయారుచేయడానికి స్టీమ్ బాయ్‌లర్‌ను ఉపయోగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వంట తయారవుతుండగా ఒక బాయ్‌లర్ అకస్మాత్తుగా పేలింది. బాయ్‌లర్‌పై ఉన్న మూత పగిలిపోయింది. పేలుడు ధాటికి గదిలోని కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి.

సమర్థత నిరూపించుకోవాలి
నగదు రహిత లావాదేవీలపై సిఎం టెలీకాన్ఫరెన్స్

విజయవాడ, డిసెంబర్ 1: సంక్షోభం కాదిది, సమర్ధతను నిరూపించుకునే అవకాశంగా ప్రతి ఒక్కరూ భావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలపై గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, ఆర్థిక శాఖ, ఇతర ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, రేషన్ డీలర్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. దీనినొక అవకాశంగా భావించి బ్యాంకర్లు, అధికారులు, సిబ్బంది తమ సమర్ధతను రుజువు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బ్యాంకర్లకు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, ప్రైవేట్ రంగాల ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భౌతిక నగదు (్ఫజికల్ కరెన్సీ) కోసం ఎదురు చూడకుండా ప్రత్యాహ్నయ మార్గాల వైపు మళ్లాలని ప్రజలకు సూచించారు. రద్దీ ఎక్కువ ఉన్న బ్యాంకుల వద్ద సిబ్బందిని పెంచాలని, కస్టమర్లకు వౌలిక వసతులు కల్పించాలని కోరారు. మొదటి వారం పది రోజులు రద్దీ ఎక్కువ కాబట్టి సిబ్బంది సహనంతో వ్యవహరించాలన్నారు. వృద్ధులు, వికలాంగులు, పింఛన్‌దారులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరాన్ని బట్టి షామియానాలు వేయాలని, మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా జరిగేలా అందరూ బ్యాంక్ సిబ్బందికి సహకరించాలన్నారు. మొబైల్ కరెన్సీపై ప్రజలకు చైతన్యపరచాలని, అందుకోసం వర్క్ షాపులు, అవగాహన సదస్సులు, ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మాసాంతంతోనే ఈ సంక్షోభం సద్దుమణగాలని, సమస్య పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ముగింపుతోనే సంక్షోభం కూడా ముగిసి పోవాలన్నదే తన అభిలాషగా పేర్కొన్నారు. 2017 నూతన సంవత్సరం నూతన అధ్యాయానికి నాంది పలకాలన్నారు. వినూత్న ఆలోచనలతోనే వినూత్న ఫలితాలు వస్తాయన్నారు. ఇదొక చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణ, దేశ చరిత్రలోనే ఒక నూతన మార్పు అంటూ దీనిని అలవాటు చేసుకోవాలని, అందరూ అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

నేడు తీరం
దాటనున్న నాడా

విశాఖపట్నం, డిసెంబర్ 1: ఉత్తర తమిళనాడు కోస్తా తీరం కడలూరు, కరెయకల్ మధ్య ఏర్పడిన తీవ్ర వాయుగుండం (నాడా తుపాను) శుక్రవారం ఉదయానికి తీరం దాటనుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఈశాన్య దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. దక్షిణకోస్తాలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేసినట్టు ఈ కేంద్రం తెలియజేసింది. కాగా ఉత్తర కోస్తాలో మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు.

గొల్లపల్లికి కృష్ణాజలాలు
హంద్రీనీవా
రెండోదశ సాకారం హంద్రీనీవా
రెండోదశ సాకారం

అనంతపురం, డిసెంబర్ 1: రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్ ఎస్‌ఎస్) పథకం మరో మైలురాయి చేరుకుంది. అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కృష్ణాజలాలను విడుదల చేయనున్నారు. మొదటి దశలో జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించారు. ప్రస్తుతం గొల్లపల్లికి నీరు విడుదల చేయనున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా మళ్లించి నీటి అవసరాలు తీర్చేందుకు హంద్రీ నీవా పథకం రూపొందించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకు మొదటి దశ పూర్తి చేశారు. తొలి దశలో 14 టిఎంసిల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. రెండోదశలో అనంతపురం జిల్లాలోని జీడిపల్లి నుంచి గొల్లపల్లి వరకు కాలువ నిర్మాణం చేపట్టారు. గొల్లపల్లి నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు హంద్రీనీవా నీటిని తరలించాలన్న లక్ష్యంతో కాలువ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. తొలి దశలో మల్యాల నుంచి 216 కి.మీ పొడవున మొత్తం 14 టిఎంసిల నీటిని, రెండోదశలో 349 కి.మీ పొడవున 29 టిఎంసిల నీటిని తరలించేలా కాలువను రూపొందించారు. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించాలన్నది లక్ష్యం. అనంతపురంలో 43 మండలాల్లో 3.45 లక్షల ఎకరాలు, కర్నూలులో 10 మండలాలు, కడపలో 6, చిత్తూరు జిల్లాలో 29 మండలాల్లో 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే తాగునీరు అందించాల్సి ఉంది. అయితే తొలి దశలో కాలువ సామర్థ్యం పెంచక పోవడంతో నీటిని అధికంగా విడుదల చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాలువ ద్వారా 14 టిఎంసిల నీటిని తరలించాల్సి ఉన్నా, ప్రస్తుతానికి 3,820 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించారు. అనంతపురం జిల్లా జీడిపల్లి నుంచి గొల్లపల్లి వరకు కాలువను వెడల్పు చేసి సామర్థ్యం పెంచాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిసినా, ఆయన సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రతిపాదనలకు ఆమోదం, నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. అయినా తొలి, రెండోదశల్లో కాలువ పనులు, అక్విడెక్టులు నిర్మిస్తూ హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలిస్తున్నారు. ఒక్కో పంప్ హౌస్‌లో 3 చొప్పున పంప్‌లను నేడు ప్రారంభించి నీటిని గొల్లపల్లి రిజర్వాయర్‌కు విడుదల చేయనున్నారు. త్వరిత గతిన కాలువను వెడల్పు చేసి మల్యాల నుంచి అనంతపురం, ఇక్కడి నుంచి క్పుపంకు నీటిని తరలించాలంటే పనులు శరవేగంగా చేయించాల్సి ఉంది.
1396 కల్తీ కారం బస్తాలు సీజ్
జివిఆర్ కోల్డ్ స్టోరేజీపై విజిలెన్స్ దాడి

దుగ్గిరాల, డిసెంబర్ 1: గుంటూరు జిల్లా దుగ్గిరాల జివిఆర్ కోల్డ్ స్టోరేజీపై కల్తీ నియంత్రణాధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో 1396 కల్తీ కారం బస్తాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు కల్తీ పసుపు వరకే పరిమితమైన దుగ్గిరాల మార్కెట్‌లో కల్తీ కారం గుట్టు రట్టవడం సంచలనం రేకెత్తించింది. విజిలెన్స్ అదనపు ఎస్పీ శోభా మంజరి, సిఐ ఆంటోని రాజ్, ఆహార కల్తీ నియంత్రణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఎవో వెంకటరావు బృందం కల్తీ కారం నిల్వలపై గురువారం ఆకస్మిక దాడులు చేశారు. గత నెల 23, 24, 26 తేదీలలో మూడు లారీల్లో 1395 బస్తాలు స్థానిక వ్యాపారి కె.మల్లిఖార్జున ప్రసాద్ పేరు మీద జివిఆర్ కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కల్తీ కారం నిల్వలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ముదిగొండ కారం మిల్లుల నుంచి దుగ్గిరాలకు కారం బస్తాలు తరలించినట్లు గుర్తించారు. మిర్చి నుంచి నూనె, రంగు వేరు చేసి ఎగుమతి చేసే ఒక ఫ్యాక్టరీ నుంచి కారం పిప్పి (నిరుపయోగమైన రసాయన మిళితమైన కారం) బస్తాలను దుగ్గిరాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. కోల్డ్ స్టోరేజీ, మిల్లుపై దాడి చేసి సుమారు రూ.40 లక్షల విలువైన కారం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అదనపు ఎస్పీ శోభా మంజరి మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీ నుంచి కల్తీ కారం నిల్వలపై దాడులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 15 వేలు బస్తాలు స్వాధీనం చేసుకున్నామని, 30 వేల బస్తాలు వ్యాపారులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారని చెప్పారు. పొడిలో సింథటిక్ రంగులు, సుడాన్, డామిన్ బి అనే ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఖమ్మంలోని చైనా కారం మిల్లు నుండి గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యాపారులు సరుకు కొనుగోలు చేశారని, ముగ్గురిని ఇప్పటికే గుర్తించామని, నాలుగో వ్యక్తి దుగ్గిరాలకు చెందిన వాడని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి కల్తీ కారం నిల్వలు తీసుకు వస్తున్నారని, కొంత మంచి కారం పొడి కలిపి విక్రయిస్తున్నారని తెలిపారు.