ఆంధ్రప్రదేశ్‌

ఖర్చులకు హద్దూ పద్దూ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను సాధించలేకపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన 2015 నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆర్థిక ఖాతాలపై కాగ్ నివేదికలను ప్రభుత్వం బుధవారంనాడు శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు పనితీరును రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రగతిని విశే్లషణలతోపాటు ఆర్థిక పరిస్థితిపై కూడా కాగ్ తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది. భారీ ఆర్థిక లోటును ఆంధ్రప్రదేశ్ నమోదు చేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2014-15 అభివృద్ధి వ్యయానికి ప్రాధాన్యత ఇచ్చినా సకాలంలో నిధులను కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితులు వచ్చాయని తెలిపింది. అదనపు వ్యయ నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొంది. శాఖాపరమైన సాధికారత లేకుండానే 13,135 కోట్లు అదనంగా వ్యయం చేశారని కాగ్ తెలిపింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండానే గంపగుత్తగా 3026 కోట్లు కేటాయింపులు చేసి చివరికి నిధులను సరెండర్ చేశారని కాగ్ పేర్కొంది. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపుల్లో ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వం ఐదున్నర కోట్ల వడ్డీ అదనంగా చెల్లించిందని కూడా కాగ్ పేర్కొంది. కేంద్రం ఆధార్ అమలుకు ఇచ్చిన 12.61 కోట్ల రూపాయిలను గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఖర్చు చేసిందని కాగ్ తెలిపింది. 2015 మార్చి 31 నాటికి 274 ప్రాజెక్టులు పూర్తి కావల్సి ఉన్నా, కాలేదని తప్పుపట్టింది. దీనిపై 32,646 కోట్లు ఖర్చుకాగా సకాలంలో పూర్తి కాకపోవడంతో 42.82 శాతం ఖర్చు పెరిగిందని కాగ్ వెల్లడించింది. ప్రధానంగా ఆర్థిక రెవిన్యూ లోటు 24,194 కోట్లు ఉందని, ద్రవ్యలోటు 31,717 కోట్లు ఉందని కాగ్ ఎత్తిచూపింది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం సూచించిన 3 శాతం పరిమితికి రెట్టింపు లోటు ఉందని పేర్కొంది. మొత్తం 6.10 శాతం లోటు నమోదైందని కూడా కాగ్ పేర్కొంది. శాసనపరమైన సాధికారత లేకుండా ఖర్చులు చేసిందని వెల్లడించింది. ఈ వివరాలు చూస్తే ఆర్థిక సంస్కరణల లక్ష్యాలను సాధించలేకపోయిందనేది సుస్పష్టమైందని పేర్కొంది. గత ఎనిమిదేళ్లు వరుసగా మిగులు సాధించిన రాష్ట్రంలో 2014-15లో మాత్రం 24,194 కోట్లు రెవిన్యూ లోటు నమోదైందని చెప్పింది. 2015 మార్చి నాటికి రాష్ట్రప్రభుత్వం అప్పులు లక్షా 66వేల 580 కోట్లు ఉందని పేర్కొంది. తాగునీరు, రహదారులు నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో అసంపూర్తి ప్రాజెక్టు పనుల వల్ల స్తంభించిన నిధులు 32,646 కోట్లు ఉందని కాగ్ పేర్కొంది. స్టాంప్ డ్యూటీ అవకతవకలు
స్టాంట్ డ్యూటీలో అవకతవకలతో ప్రభుత్వానికి 9.85 కోట్ల నష్టం వాటిల్లిందని ఎపి కాగ్ తన నివేదికలో పేర్కొంది. రవాణా శాఖలో పన్నుల అవకతవకలతో 7.09 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. సరైన భూమి శిస్తు విధానం లేకపోవడంతో 76.11 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించింది. పరిశ్రమలు, వాణిజ్యం, విద్యుత్ శాఖల్లో 749.60 కోట్ల అవినీతి, అబ్కారీ శాఖలో 5.76 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. రెవిన్యూ బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసిన కాగ్ 2015 మార్చి 31 వరకూ 6960.12 కోట్ల బకాయిలను గుర్తించింది. 2014 జూన్ 2 నుండి 2015 మార్చి 31 వరకూ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన రెవిన్యూ 38,038.22 కోట్లు మాత్రమేనని తేల్చింది. రెవిన్యూ లోటును తప్పుగా చూపించారని కూడా కాగ్ కీలకమైన ఆరోపణలు చేసింది.