ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ప్రభుత్వ పర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 2: నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక యాప్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. ఎపి పర్స్ పేర సిద్ధమవుతున్న ఈ యాప్ అన్ని స్మార్ట్ఫోన్లలో పనిచేసేలా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవం ఉన్న యువత ఈ యాప్‌కు సంబంధించిన ప్రాథమిక వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడంతో ఆయన సంతృప్తి చెంది యాప్ తయారుచేయాలని కోరినట్లు సమాచారం. ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత ప్రజలు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబరుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించుకోవాలనుకున్న సందర్భంలో చెల్లింపులు పూర్తి చేసే ముందు ప్రజలు తమ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు తీసుకున్న సందర్భంలో ఇచ్చిన వేలిముద్రలతో ప్రస్తుత వేలిముద్రలు సరిపోల్చుకున్న అనంతరమే చెల్లింపులకు యాప్ అంగీకరిస్తుంది. దీంతో ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక స్మార్ట్ఫోన్ నుంచి ఎన్ని బ్యాంకు ఖాతాలనైనా అనుసంధానం చేసుకోవచ్చు. ఏ బ్యాంకుఖాతాల్లో సొమ్ము ఉంటే ఆ ఖాతా నుంచి సొమ్మును ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు చెల్లించే అవకాశముంటుంది.
ఇక ప్రభుత్వపరమైన స్థానిక సంస్థల పన్ను చెల్లింపు, విద్యార్థుల పరీక్షల ఫీజులు, విద్యుత్ బిల్లులు తదితరాలను యాప్ ద్వారా చెల్లించవచ్చు. కాగా ఎపి పర్స్ యాప్ ద్వారా క్రయవిక్రయాలు చేసుకోవడానికి అన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్ విక్రయ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక పేదలకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని నగదుగా చెల్లించడానికి బ్యాంకుల్లోనే కాకుండా ప్రైవేటు సంస్థల ద్వారా తీసుకునేందుకు వీలుగా ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు నిత్యావసరాల కొనుగోలు సమయంలో ఎపి పర్స్ ద్వారా ఆయా దుకాణాలకు సంబంధించిన ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బహుళ ప్రయోజనాలు కల్పించేలా ఏపి పర్స్ యాప్‌ను రూపొందించి కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు స్పష్టమవుతోంది.