ఆంధ్రప్రదేశ్‌

జనవరి 25 నుంచి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 2: కాపులను బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో తాను చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్రకు పోలీసుల నుండి ఏ విధమైన అనుమతి కోరేదిలేదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. జనవరి 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. కాకినాడ నగరంలోని రమణయ్యపేటలో జెఎసి రాష్ట్ర నేత వివై దాసు నివాసంలో శుక్రవారం జరిగిన 13 జిల్లాల కాపు జెఎసి నేతల సమావేశంలో రానున్న రోజుల్లో నాలుగు దశలలో ఉద్యమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించిరు. ఈ సందర్భంగా ముద్రగడ విలేఖర్లతో మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధన ధ్యేయంగా రాష్ట్రంలోని కాపులంతా నాలుగు దశల్లో ఆందోళన సాగిస్తారన్నారు. తొలి దశలో ఈ నెల 18న అన్ని ప్రాంతాల్లో కాపులు నల్లని వస్త్రాలతో ఖాళీ కంచాలను గరిటెలతో మోగించి నిరసన తెలియజేస్తారన్నారు. 30వ తేదీన బిసిలుగా గుర్తించాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తారన్నారు. జనవరి 8వ తేదీ రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలియజేస్తారన్నారు. జనవరి 25వ తేదీన ముందుగా అనుకున్నట్టు రావులపాలెం నుండి సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ పాదయాత్రకు పోలీసుల నుండి అనుమతి కోరే ప్రసక్తి లేదని చెప్పారు. శాంతిభద్రతల రీత్యా కావాలంటే పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. గతంలో పాదయాత్రలను నిర్వహించినపుడు టిడిపి అధినేత చంద్రబాబు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. పాదయాత్ర సమయంలో తారురోడ్లపై మట్టి పోయించుకుని నడచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. కాపుల రిజర్వేషన్ల డిమాండ్‌కు వ్యతిరేకంగా బిసిలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించినపుడు పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారా అని ముద్రగడ ప్రశ్నించారు. పాదయాత్రకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిపక్ష నేత జగన్‌కే అనుమతి ఇచ్చామని, ముద్రగడ కూడా అనుమతి కోరితే పరిశీలిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్న అంశాన్ని విలేఖరులు ప్రస్తావించగా తాను అనుమతి కోరనని చెప్పారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం