ఆంధ్రప్రదేశ్‌

వేమన శతకంతో ఏడు రికార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, డిసెంబర్ 2: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం నాలుగు పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్ధులు అరుదైన ఏడు రికార్డులు సొంతం చేసుకున్నారు.
45 నిమిషాల్లో నిర్విరామంగా వంద వేమన పద్యాలు పూర్తిచేసి ఈ రికార్డులు సొంతం చేసుకున్నారు. యునైటెడ్ బుక్ ఆప్ వరల్డు, భారత్ బుక్ ఆఫ్ వరల్డు, స్టేటు బుక్ ఆఫ్ రికార్డ్సు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్సు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్సు, లిటిల్ బుక్ అఫ్ రికార్డ్సు, వర్మ బుక్ ఆఫ్ వరల్డు రికార్డులను విద్యార్థులు సాధించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాణ చేతుల మీదుగా తెలుగు రికార్డు అంబాసిడర్ శ్యామ్ ఈ కార్యక్రమం నిర్వహించిన క్షీరపురి సాహితీ సమితికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. పోడూరు జడ్పీ ఉన్నత పాఠశాల, పండితవిల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల, కవిటం జడ్పీ ఉన్నత పాఠశాల, జిన్నూరు ఐడియల్ పాఠశాల విద్యార్ధులు ఈ అరుదైన రికార్డు సాధనలో భాగస్వాములయ్యారు. కార్యక్రమం చివర్లో వెయ్యిమంది విద్యార్థులు ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ, జనగణమన గీతాలు అందరినీ పులకింపజేశాయి. ఆహుతులు కూడా వారితో గొంతు కలపడం విశేషం.

చిత్రం.. ఏడు రికార్డుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్న దృశ్యం