ఆంధ్రప్రదేశ్‌

మోదీని తిట్టమని బాబు చెప్పారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీది తుగ్లక్ పాలనగా పేర్కొనడాన్ని భారతీయ యువ మోర్ఛా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.రమేష్‌నాయుడు తీవ్రంగా ఖండించారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరోపక్క ఆ పార్టీ నాయకులు విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ అధినేత చంద్రబాబే తన సహచరులతో ఈ రకమైన విమర్శలు, ఆరోపణలు చేయిస్తున్నారా అనేది స్పష్టం చేయాలని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు లెక్చరర్లకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీలను ఇచ్చిందన్నారు. ఆ హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడంతో కాంట్రాక్టు లెక్చరర్లు పర్మినెంట్ ఉద్యోగాలకై డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్ సమంజసమైందన్నారు. నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చిన వారిపైనే కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత విశ్వసనీయ సర్వేలు చేయిస్తే అందులో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఒక శాతం అదనంగా మోదీకి మద్దతు లభించిందన్నారు. సమావేశంలో యువ మోర్ఛా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కాల రజనీకాంత్, మీడియా ఇన్‌ఛార్జి దిలీప్ పాల్గొన్నారు.