ఆంధ్రప్రదేశ్‌

బెంగళూరు-న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, డిసెంబర్ 4: బెంగళూరు-న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మహిళల బోగీలోకి చొరబడిన దొంగలు ఓ ప్రయాణికురాలి నుంచి బంగారం, లగేజీ ఎత్తుకెళ్లాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు - న్యూఢిల్లీ(నెం.12214) దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణికురాలిని బెదిరించి ఆమె వద్ద గల నగదు, ప్రయాణికులకు సంబంధించిన లగేజీ అపహరించుకుని పోయినట్లు సమాచారం, దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్ మారేందుకు కొన్ని నిమిషాల పాటు గుంతకల్లులో నిలుస్తుంది. ఈ విషయం పసిగట్టిన దొంగ ఆదివారం తెల్లవారుజామున రైలు రాగానే అమె వద్ద ఉన్న బంగారం, నగదు తీసుకుని తాపీగా గుంతకల్లు స్టేషన్‌లో దిగిపోయినట్లు సమాచారం. అయితే గుంతకల్లు స్టేషన్‌లో ఎక్కువ సేపు రైలు నిలబడక పోవడంతో ప్రయాణికులు సికింద్రాబాద్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజామున గార్లదినె్న సమీపంలో సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో దుండుగులు హల్‌చల్ సృష్టిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు జరిపారు. దొంగలు కనిపించకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.