ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఆస్తిపన్ను గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 31: రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు గడువు గురువారంతో ముగిసింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున కూడా పెద్ద ఎత్తున ఇంటి యజమానులు పన్ను చెల్లించేందుకు బారులు తీరారు. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు రూ.801.87 కోట్లు వసూలు చేయగలిగారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13 కార్పొరేషన్ల నుంచి ఆస్తిపన్ను డిమాండ్ రూ.679.02 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.547.78 కోట్లు వసూలు చేసి 80.6 శాతం లక్ష్యం చేరుకున్నారు. అలాగే వివిధ మున్సిపాల్టీల నుంచి డిమాండ్ రూ.333.32 కోట్లు కాగా, రూ.237.15 కోట్లు వసూలు చేసి 71.15 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇక నగర పంచాయతీలకు సంబంధించి లక్ష్యం రూ.27.82 కోట్లు కాగా, వసూళ్లు మాత్రం రూ.17.43 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడంతో చివరి రోజున రాత్రి వరకు పన్ను బకాయిలు వసూలు చేశారు. గత ఏడాదితో పోల్చిచూస్తే ఈసారి ఆస్తి పన్ను వసూళ్లలో 19.35 శాతం వృద్ధి సాధించారు. కార్పొరేషన్లకు సంబంధించి గత ఏడాది రూ.464.95 కోట్లు వసూలు చేయగా, ఈ ఏడాది రూ.547.28 కోట్లు వసూలు చేయగలిగారు. వృద్ధి శాతం 17.71గా నమోదైంది. అలాగే వివిధ మున్సిపాల్టీలకు సంబంధించి గత ఏడాది ఇదే సమయానికి రూ.191.66 కోట్లు వసూలు చేయగా, నేడు రూ.237.15 కోట్లు వసూలు చేశారు. మున్సిపాల్టీలకు సంబంధించి వసూళ్లలో 23.73 శాతం వృద్ధి సాధించారు. అలాగే నగర పంచాయతీలకు సంబంధించి గత ఏడాది రూ.15.70 కోట్లు వసూలు చేయగా, ఈ ఏడాది రూ.17.43 కోట్లు వసూలు చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే 14.62 శాతం వృద్ధి సాధించినట్టయింది. ఇదిలాఉండగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార వర్గాలకు సంబంధించి గత కొనే్నళ్లుగా ఆస్తిపన్ను పెంపుదల జరగలేదు. కొన్నిచోట్ల ఆస్తిపన్ను విధించకపోగా, మరికొన్నింటికి పెంపుదల జరగలేదు. ఈ విధంగా అన్‌అసెస్‌మెంట్, అండర్ అసెస్‌మెంట్ కసరత్తు జరగలేదు. ఆస్తిపన్ను అసెస్‌మెంట్ చేపట్టకుండా వదిలిపెట్టిన వాణిజ్య భవనాలు, వాణిజ్య సముదాయాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి దాదాపు రూ.100 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు మున్సిపాల్టీలలో విలీనమైన పంచాయతీలకు సంబంధించి కూడా పన్ను విధింపు జరగలేదు. ఈ విధంగా ఆస్తిపన్ను బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. ఏది ఏమైనప్పటికీ గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 19.35 శాతం వృద్ధి సాధించడం గమనార్హం.