ఆంధ్రప్రదేశ్‌

మంచినీటి ఎద్దడి నివారణకు రూ.120 కోట్లతో ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, డిసెంబర్ 4: వేసవిలో రాష్టవ్య్రాప్తంగా మంచినీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు 120కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కార్యాచరణను రూపొందించినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా, చోడవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంపై వేసవి మూడునెలల్లో రాష్టవ్య్రాప్తంగా ఉన్న మంచినీటి పథకాలు, పైపులైన్లు, మోటార్‌లకు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టడానికి 120కోట్ల రూపాయలను కేటాయించినట్టు చెప్పారు. జిల్లాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ఈనెలాఖరులోగా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఆయా కలెక్టర్‌లకు పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించామన్నారు. రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతోపాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు నిర్ణయించామని, ఇందుకు అదనంగా నిధులు కేటాయించినట్టు వివరించారు. అవసరమైతే రైతుల వ్యవసాయ బోర్లకు అద్దె చెల్లించి అక్కడి నీటిని సేకరించేందుకు కూడా నిర్ణయించామని తెలిపారు.
పెద్దనోట్ల రద్దు తొందరపాటు నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తొందరపాటు చర్యని అయ్యన్న అభిప్రాయపడ్డారు. అయితే, కొద్దిరోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిర్ణయం వలన దొంగనోట్ల చెలామణీ తగ్గుతుందన్నారు. అలాగే బంగారు ఆభరణాలపై వస్తున్న వందతులను నమ్మరాదని సుమారు ఒక్కో ఇంటికి కిలో బంగారం వరకు ఉంచుకునే అవకాశముందన్నారు.

చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అయ్యన్నపాత్రుడు