ఆంధ్రప్రదేశ్‌

వోల్వో బస్సు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణగిరి, డిసెంబర్ 4: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్లో బస్సు ఆదివారం తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్‌కు చెందిన వోల్లో బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుండి బెంగళూర్‌కు బయలు దేరింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు బస్సు నిలబడగా అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది డ్రైవర్లను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్లు సూర్యకాంత్, సంజీవ్‌కుమార్ బస్సులోని 20 మంది ప్రయాణికులను నిద్రలేపి కిందికి దింపారు. ప్రయాణికులు బస్సు దిగిన కొద్ది సేపటికే మంటలు దట్టంగా వ్యాపించాయి. టోల్‌ప్లాజా వద్ద విధులు నిర్వహిస్తున్న కృష్ణగిరి కానిస్టేబుళ్లు నాగరాజ్, సునిల్ విషయాన్ని డోన్ అగ్నిమాపకశాఖ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎస్సై సోమ్లానాయక్, డోన్ సిఐ శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు భూపాల్‌రెడ్డి, భాలరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చిత్రం..కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు
టోల్‌ప్లాజా వద్ద తగులబడుతున్న వోల్వో బస్సు