రాష్ట్రీయం

ఉత్కంఠభరితంగా నౌకాదళ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: పాకిస్తాన్‌పై విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా ఆదివారం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొనగా, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ నేతృత్వంలో నేవీడే జరిగింది. ఈ సందర్భంగా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఎనిమిది మంది నౌకాదళ స్కైడైవర్లు ఆకాశం నుంచి భారత జాతీయ పతాకాన్ని, నౌకాదళ పతకాన్ని ఎగురవేస్తూ విన్యాసాలను ప్రారంభించారు. శత్రు దేశాల నౌకలు, జలాంతర్గాములను గుర్తించి వాటిని మట్టుపెట్టే హెలికాఫ్టర్లు, విమానాలు, నౌకలు ప్రదర్శించిన అంశాలు సందర్శకులను ఉత్కంఠ భరితులను చేశాయి. నౌకాదళంలో తక్షణ సహాయకారిగా ఉపయోగించే (ఐఎస్‌వి) స్పీడ్ బోట్ల నుంచి తీర రక్షణ కమాండోలు, తీరంలో ఉగ్రవాదులు మట్టుబెట్టే ఆపరేషన్లు, విపత్తుల సందర్భంగా నౌకాదళానికి చెందిన హెలికాఫ్టర్లు(యుహెచ్ 3హెచ్) నడిసముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించే విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

చిత్రం..నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా విశాఖ తీరంలో జరిపిన
విన్యాసాల్లో ఆయిల్ రిగ్‌ను పేల్చివేస్తున్న దృశ్యం