ఆంధ్రప్రదేశ్‌

పది నిమిషాల్లో 500 కోడిగుడ్లు హాంఫట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 5: గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ‘జెమ్స్ ఇన్ ఎగ్ ఈటింగ్ కాంపిటేషన్’ సరదా పోటీలో విద్యార్థులు పది నిమిషాల్లో ఏకంగా 500 కోడిగుడ్లను తిని రికార్డు నెలకొల్పారు. ఈ నెల 9 నుంచి గీతం విశ్వవిద్యాలయం వేదికగా జరుగనున్న జాతీయస్థాయి యువజనోత్సవ గీతం ఎక్స్‌లెన్స్ మీట్-2016కు ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఈ పోటీని నిర్వహించారు. పోషకాహార ప్రాధాన్యత తెలిపే, ముఖ్యంగా కోడి గుడ్లలో గల పోషక విలువులను తెలియజెప్పడానికి నిర్వహించిన ఈ పోటీలో మేనేజ్‌మెంట్ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉడికించిన కోడి గుడ్లను పది నిమిషాల్లో పెంకు తొలగించి తినడం పోటీలో ప్రధాన అంశం కాగా విద్యార్థులు 500 కోడిగుడ్లను సునాయాసంగా తిని చూపరులను ఆకట్టుకున్నారు. ఈ పోటీల ద్వారా వచ్చిన మొత్తాన్ని స్థానిక మానసిక వికలాంగుల పాఠశాల ‘హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్’కు విరాళంగా అందజేస్తున్నట్టు గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీలా తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

చిత్రం..పది నిమిషాల్లో 500 కోడిగుడ్లు తినేసిన గీతం మేనేజ్‌మెంట్ కళాశాల విద్యార్థులు