ఆంధ్రప్రదేశ్‌

భాషా ప్రాధికార సంస్థను పునరుద్ధరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 5: తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణను మరింత పటిష్టపరిచేలా తెలుగు భాషా ప్రాధికార సంస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం జరిగిన తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో తెలుగు అకాడెమీ పూర్తిస్థాయిలో పనిచేయని మాట వాస్తవమేనన్నారు. తెలుగు భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విభజన చట్టం షెడ్యూల్ 10 ప్రకారం పంపకాలు పూర్తికాలేదన్నారు. వచ్చే జన్మభూమి కార్యక్రమంలో గ్రామ సభల ప్రారంభానికి ముందు కూచిపూడి, జానపద కళలను ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రాచీన తెలుగు కళలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇప్పిస్తున్నట్టు ఉప సభాపతి వెల్లడించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు భాష, సంస్కృతిని తరతరాలకు అందించాలన్న లక్ష్యంతోనే ప్రస్తుత కమిటీ ఏర్పాటు చేశారని, రాష్ట్రంలోని కీకల ప్రాంతాలతో పాటు చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో కమిటీ పర్యటించి భాష, సంస్కృతుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి నివేదిక అందజేయనున్నట్టు వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించి ప్రజలు, భాషాభిమానులు, కళాకారుల సలహాలు క్రోడీకరించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు బుద్ధ ప్రసాద్ వెల్లడించారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ సంగీత, సాహిత్య, నాటక, లలితకళా అకాడెమీలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సాంస్కృతిక విభాగం డైరెక్టర్ విజయ భాస్కర్ పాల్గొన్నారు.

చిత్రం..తెలుగు భాషా, సంస్కృతి, అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న బుద్ధప్రసాద్