రాష్ట్రీయం

ఆహా! ఏమి రుచి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అరకు కాఫీ రుచిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆహా! ఇదేమి రుచి.. చాలా బాగుందన్నారు. శనివారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిసిసి ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్‌ను సందర్శించారు. అక్కడ కాఫీ రుచి చూసిన ప్రధాని మోదీ దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడిగి తెలుసుకున్నారు. కాఫీ రుచి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరకు కాఫీ విశిష్టత గురించి ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేతి వృత్తుల కళాకారులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. హస్త కళలకు మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంది.. మీకు ఏ మేరకు గిట్టుబాటు అవుతుందని ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నావికాదళం స్టాళ్లను సందర్శించారు. అక్కడ భారత నౌకాదళం ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్‌ను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. భారత నావికాదళ ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ ఆయనకు వివరించారు. భారత్‌కు సముద్రం వైపు నుంచి ముప్పురాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నదీ తెలియజేశారు. ఆ తరువాత భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన కృషిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన నమూనా ప్రదర్శనలను తిలకించారు. క్షిపణులు బ్రహ్మోస్, అస్తద్రాన్, టార్పెడోలు, నీటిలో ఉన్న వాటిని గుర్తించే పరికరాలు, నావికదళం ఉపయోగిస్తున్న హెలీకాప్టర్లు తదితర వాటిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. నావికాదళంలో ఏయే ఆయుధాలను ఉపయోగిస్తున్నదీ, కొత్త రకాలను గురించి తెలిపారు. తూర్పు తీర ప్రాంతం, బంగాళాఖాతం ప్రాంతంపై నిఘా ఏ విధంగా ఉంచుతున్నదీ భారత నావికాదళ అధిపతి ఆర్కే ధావన్ ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సతీష్ సోనీతోపాటు పలువురు నావికాదళ అధికారులు పాల్గొన్నారు.

అధ్యక్షుడి విశ్వ నౌకా సమీక్ష‚

‘జై’కొట్టిన నావికాదళాలు రెండు గంటలపాటు యుద్ధనౌకపై ప్రణబ్ ముఖర్జీ

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 6: విశాఖలోని ఆర్‌కె బీచ్.. మబ్బులు కమ్మిన ఆకాశం నుంచి సూరీడు తొంగి చూస్తున్నాడు. విశాఖ తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరానికి వెళితే.. పెద్ద సంఖ్యలో బారులు తీరిన దేశ, విదేశీ యుద్ధ నౌకలు.. యుద్ధ సమయంలో ఉండే గాంభీర్యం వాటిలో కనిపించడంలేదు. పెళ్లికూతురిలా అలంకరించుకుని, వినయంతో వరుస క్రమంలో నిలుచున్నాయి. వాటిపై ధవళవర్ణ దుస్తులతో నావికాదళ సిబ్బంది హుందాగా నిలబడి ఉన్నారు. వీరంతా ఎదురు చూస్తున్నది భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడైన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కోసం.. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లోని కీలక ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు కొద్ది క్షణాల ముందు శనివారం ఉదయం బంగాళాఖాతంలో కనిపించిన దృశ్యాలివి. తన బలంతో పాటు.. ఇతరుల బలాన్ని కూడా తెలుసుకోవడం.. మన స్నేహ హస్తాన్ని అందుకున్న వారికి అండగా ఉండడం.. సముద్ర వాణిజ్యానికి భద్రత కల్పిస్తూ, పరోక్షంగా దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వ్యూహ రచన చేయడం.. పొంచి ఉన్న శత్రుమూకల గుండెల్లో నిద్రపోయేందుకు సుదీర్ఘ కాలపరిమితి ఉన్న ప్రణాళికలు రచించడం లక్ష్యాలుగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో దేశ, విదేశీ నౌకలను సమీక్షించేందుకు సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సిద్ధంగా ఉన్నారు. నేవీ మెస్ నుంచి రాచ మర్యాదలతో ప్రణబ్‌ను డాక్‌యార్డులోని నేవల్ జెట్టీ వద్దకు తోడ్కొనివచ్చారు. అక్కడ 150 మంది నౌకాదళ సిబ్బంది గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.
ఆయనతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అక్కడికి చేరుకున్నారు. వీరితోపాటు భారత నౌకాదళ అధిపతి ఆర్‌కె ధావన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రహా, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి సతీష్ సోనీ, దక్షిణ నౌకాదళ అధికారి గిరీష్ లోద్ర, పశ్చిమ నౌకాదళ అధికారి సునీల్ లాంబ, అండమాన్ నికోబార్ నౌకాదళ అధికారి ప్రదీప్ కుమార్ చటర్జీ సిద్ధంగా ఉన్నారు. 8.50 గంటల సమయంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధ నౌకపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై ఆశీనులయ్యారు. ఆయనకు ఇరుపక్కల ప్రధాని, రక్షణ మంత్రులు కూర్చున్నారు. తొమ్మిది గంటలకు యుద్ధనౌకల సమీక్షకు ‘సుమిత్ర’ ఠీవిగా బయల్దేరింది. ఆ నౌకను ఐఎన్‌ఎస్ సుమేథ, ఐఎన్‌ఎస్ సునయన, ఐఎన్‌ఎస్ సరయు అనుసరించాయి.
ఆరు వరుసల్లో బారులు తీరిన యుద్ధ నౌకలు, కోస్ట్‌గార్డ్ నౌకలు, శిక్షణ నౌకలు, వాణిజ్య నౌకలను రాష్టప్రతి సమీక్షించారు. ఈ నౌకల మధ్య నుంచి అధ్యక్షుని నౌక పయనించింది. ఒక్కో నౌకను దాటుతున్నప్పుడు ఆయా నౌకలపై ఉన్న నావికాదళ సిబ్బంది తమ టోపీలను తీసి వృత్తాకారంగా తిప్పుతూ మూడుసార్లు జై..జై..జై..అంటూ నినాదాలు చేశారు. రాష్టప్రతి వీరికి శెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. 2006 సంవత్సరంలో విశాఖలో జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో అప్పటి రాష్టప్రతి అద్బుల్ కలాం ఈ గౌరవాన్ని పొందారు. అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఇప్పుడు రాష్టప్రతి, సర్వసైన్యాధ్యక్షుని హోదాలో ఇదే తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం గమనార్హం.యుద్ధ నౌకల సమీక్ష ముగిసిన వెంటనే హెలికాప్టర్లు, యుద్ధ విమానాల విన్యాసాలు అద్భుతంగా సాగాయి. వీటిలో మిగ్ 29కె, లాంగ్ రేంజ్ మిసైల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎఇడబ్ల్యు హెలికాప్టర్ కెఎం-31 అద్భుత విన్యాసాలు చేశాయి. అలాగే మార్కోస్, స్పీడ్ స్కూటర్స్ శరవేగంగా దూసుకుంటూ వచ్చాయి. సముద్ర జలాల పరిక్షణ ప్రక్రియను కళ్లకు కట్టినట్టు చూపించాయి.

నౌకాదళ సిబ్బందినుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ

సముద్ర విమానాలు

పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రానికి ప్రతిపాదనలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించిన విశాఖ నగరం ఇపుడు స్మార్‌సిటీగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే క్రమంలో సముద్ర విమానాలను (సీ ప్లెయిన్స్) ప్రవేశపెట్టాలని పర్యాటకశాఖ ఆలోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై అనేకసార్లు సమీక్ష జరిపిన ఈ శాఖ ఉన్నతాధికారులు కర్నూలు డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 950 కిలోమీటర్లకు పైగానే సముద్రతీర ప్రాంతం ఉండటంతో విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకుని సముద్ర విమానాలు నిర్వహించే అంశాన్ని పర్యాటకశాఖ గత ఏడాది కాలంగా పరిశీలిస్తూనే ఉంది. అయతే ఇపుడు దీనికి మరింత ఆదరణ లభించే అవకాశాలున్నందున అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. సముద్రంపై విమానాలు తిరిగేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెడితే పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చని కూడా ఈశాఖ భావిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ప్రయోగాత్మంగా అమలు చేస్తోన్న హెలీ టూరిజానికి పర్యాటకులు, సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గత ఏడాది జూలైలో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెలీ టూరిజానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహోత్సవాలకు హెలీ టూరిజం పథకాన్ని అమలు చేసింది.