ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్ఠాత్మకంగా ‘స్వాస్థ్య విద్యావాహిని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 8: విద్యార్థి దశ నుండే మెడికోలు గ్రామాల్లో పర్యటించి ప్రజారోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామన్నారు. గురువారం గుంటూరు వైద్యకళాశాల జింఖానా ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి కామినేని మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. స్వాస్త్య విద్యావాహిని కింద ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత, ఇతర కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నెలకో గ్రామాన్ని ఎంచుకుని పర్యటించాలన్నారు. గ్రామాల్లో కుటుంబాలను పరామర్శించి పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, తదితర ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. అనంతరం ఆరోగ్య సంరక్షణపై సంపూర్ణ అవగాహన కలిగించాలని వివరించారు. దీనివల్ల గ్రామీణ ఆరోగ్య స్థితిగతులను ఆధ్యయనం చేసే వీలు కలుగుతుందని చెప్పారు. ఇలాంటి అంశాలపై విద్యార్థి దశ నుండే ఆకళింపు చేసుకుంటే భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించ గలుగుతారని అభిప్రాయపడ్డారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వాస్త్య వాహిని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ వైద్యులుగా ఎదిగేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రపంచ జనాభాలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో ఉందని ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ద కనబరుస్తోందని, ఇందులో భాగంగానే స్వాస్త్య విద్యావాహిని కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు దాదాపు 30వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ఇద్దరు లేక ముగ్గురు వైద్యులు దత్తత తీసుకుని పర్యటించాల్సి ఉందన్నారు. ఏడాదిలో రెండు నెలలు పరీక్షలు, సెలవులు మినహా మిగిలిన పది నెలల్లో పది గ్రామాలను విద్యార్థులు సందర్శించి ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండాలన్నారు. సదస్సులో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ దుర్గాప్రసాద్, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రేవతి, వైద్య విద్య సంచాలకులు సుబ్బారావు, పాల్గొన్నారు.
జగన్‌కు మంత్రి కామినేని బహిరంగ లేఖ
విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య పథకం అమలు ఇష్టం లేదా అంటూ ప్రతిపక్ష నేత జగన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. పథకం అమలు జరుగుతున్న తీరు చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణల విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు జగన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాల గురించి మాట్లాడుతూ పేద రోగులకు 1044 రకాల వైద్య సేవలు అందిస్తుండటంతో గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. ఇందుకు ప్రభుత్వం 1063 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనే వాస్తవాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.