ఆంధ్రప్రదేశ్‌

జనవరి నుంచి అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్టీసీలోని అన్ని బస్సులకు అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ సిస్టం విధానాన్ని అమలు చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడి ఆర్టీసీ వర్క్‌షాపు, బస్సు డిపోలను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపడుతున్నామన్నారు. సంస్థకు లాభాలు రావాలంటే సిబ్బంది ప్రవర్తనలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీపై రుణభారం రూ.1000 కోట్లు ఉందన్నారు. దీంతోపాటు ఇటీవల డీజిల్ ధరలు పెరగడం వల్ల సంస్థపై మరో రూ.32 కోట్లు అదనపు భారం పడిందన్నారు. ఈ భారాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా ఆక్యుపెన్సీ రేషియో (ఒఆర్) పెంచడం, ఇంధన వినియోగంలో పొదుపు, విడి భాగాల తగ్గింపు, బ్యాంకు వడ్డీ తగ్గింపునకు చర్యలు తీసుకున్నామన్నారు. దాంతోపాటు ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా సిబ్బంది ప్రవర్తనలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. మరోపక్క ఆటోలు, క్యాబ్స్ ఇతర వాటిలో ఓవర్ లోడ్ తగ్గించాలని రవాణాశాఖ, పోలీసు శాఖలను కోరామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోజుకు 54వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని, జుకు రూ.13.85 లక్షలు ఆదాయం వస్తుందని ఎండి తెలిపారు.