ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10:అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ మొదలైంది. పలుచోట్ల సంస్థకు చెందిన ఆస్తులను గుర్తించిన సిఐడి సీజ్ చేసిన కృష్ణాజిల్లా, విజయవాడలో కలిపి మొత్తం 24 ఆస్తులను యుద్ధప్రాతిపదికన వేలం వేసేందుకు ప్రకటన చేసింది. వేలం ప్రక్రియ ముగిశాక ఆస్తులు అమ్మగా వచ్చే సొమ్మును డిపాజిట్‌దారులకు పంచితే సుమారు 80శాతం మంది బాధితులకు న్యాయం చేసినట్లవుతుందని డిజిపి నండూరి సాంబశివరావు వెల్లడించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈమేరకు హైకోర్టు పర్యవేక్షణలో వేలం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. సంస్థలో డబ్బు డిపాజిట్ చేసి నష్టపోయిన బాధితుల సంఖ్య దాదాపు19 లక్షలమందికాగా, వీరికి సంబంధించి సుమారు 32 లక్షల అకౌంట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి సంస్థ చెల్లించాల్సిన విలువ సుమారు 6,380 కోట్లుగా లెక్క తేల్చామన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే బాధితుల సంఖ్య 11,57,503 లక్షల మంది కాగా.. వీరికి సంబంధించి 19,52,256 లక్షల అకౌంట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి బాధితులకు చెల్లించాల్సిన మొత్తం 3,966 కోట్లు కాగా, ఇప్పటికిప్పుడు వేలం వేసేందుకు ప్రకటించిన ఆస్తుల నుంచి సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం సుమారు 2,200 కోట్లు రావచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఐదువేల లోపు..డిపాజిట్ చేసిన ఖాతాదారులే సుమారు ఐదులక్షల పైగా ఉంటే.. ఐదు నుంచి 20వేల వరకు కట్టిన వారు ఏడు లక్షలకు పైచిలుకు ఉన్నట్లు చెప్పారు. నవంబర్ 7వ తేదీ విచారణ అనంతరం హైకోర్టు ఆదేశాలతో సిఐడి అదనపు డిజి నేతృత్వంలో తాజా వేలం ప్రక్రియకు అనుమతి లభించిందన్నారు. దీంతో కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం వద్ద 11చోట్ల మొత్తం 341 ఎకరాల వ్యవసాయ భూమి, అదేవిధంగా విజయవాడ నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో 13 ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. వేలంలో పాల్గొనేవారు డిసెంబర్ 18వ తేదీలోగా ఆస్తులను స్వయంగా పరిశీలించుకోవచ్చని, బిడ్‌లకు సంబంధించి సీల్డు కవర్‌లో ఉంచి పూర్తి వివరాలు 26వ తేదీలోగా హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపడం జరుగుతుందని, డిసెంబర్ 27వ తేదీన హైకోర్టు సమక్షంలో స్డీలు కవర్ తెరవడ జరుగుతుందని చెప్పారు.
chitra...
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న డిజిపి సాంబశివరావు