ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం జిల్లాలో గజరాజుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, డిసెంబర్ 11: శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజులుగా గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, హిరమండలం మండలంలోని రుగడ గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మికగూడ గిరిజన గ్రామంలో 13 పూరిళ్లును ధ్వంసం చేశాయి. క్రైస్తవ మందిరాన్ని, పంటలను ధ్వంసం చేశాయి. దీంతో ప్రమాదం అంచుల్లో ఉన్న గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. బొమ్మికగూడ గిరిజన గ్రామం కొండప్రాంతానికి సమీపంలో ఉంది. ఏనుగుల గుంపు శనివారం రాత్రి ప్రవేశించింది. గ్రామంలోకి ప్రవేశించి సవర సుబాకు, పవిత్ర, అబ్రహాం, ప్రసాద్‌తో పాటు మరో 9 మందికి చెందిన పూరిళ్లను ధ్వంసం చేశాయి. ఇళ్లల్లో దాచుకున్న ధాన్యాన్ని, బియ్యం, రాగులు, ఇతర నిత్యావసర వస్తువులను ఆరగించాయి. అరటి, కంది, వరి, ఇతర పంటలను కూడా నాశనం చేశాయి. అవలంగి గ్రామానికి చెందిన లావేటి జోగినాయుడు ఎకరా వరిచేలు కుప్పలను కూడా ఏనుగులు నాశనం చేశాయి. భీతిల్లిన గిరిజనులు సమీపంలోని కొండల గుట్టల్లోకి పరుగులు తీశారు. రాత్రంతా గిరిజనులు జాగారం చేశారు. ఏనుగుల బీభత్సం సమాచారం అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందడంతో ఆదివారం తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమయంలో కూడా ఏనుగులు పరిసరాల్లోనే సంచరించడంతో అధికారులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పరిసరాల్లో మంటలు వేసి రక్షణ చర్యలు చేపట్టారు. గిరిజన కుటుంబాలను సమీపంలోని అవలంగి పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏనుగుల తరలింపుపై పటిష్ఠమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో గ్రామాల్లో గిరిజనులు నివసించడానికి భయకంపితులవుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.