ఆంధ్రప్రదేశ్‌

16 వేల ఈ-పోస్ యంత్రాల కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా 16 వేల ఈ-పోస్ మిషన్ల కోనుగోలుకు ఎపిఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూపే, క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండి మాలకొండయ్య తెలిపారు. ఈ-పోస్ యంత్రాలను తెలుగువెలుగు, సిటి బస్సులు, ఎక్స్‌ప్రెస్, ఎసి, అమరావతి, తదితర సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మిషన్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని, మరో మూడు నెలల్లో ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలే జరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంక్‌లతో ఈ-పోస్ మిషన్లను అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్లలో 1434 ఈ-పోస్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 2667 మిషన్లను స్టాండ్‌బైగా ఉంచనున్నారు.