ఆంధ్రప్రదేశ్‌

బిసి జాబితాలో ‘మొదలియార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: వెనుకబడిన తరగతుల సబ్ గ్రూప్-డి కింద అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివసించే అగముద్దీన్, అగముదీర్, అగముదీ వెల్లలార్, అగముదీ మొదిలియార్ (తుళువ వెల్లలాస్‌తో కలిపి) సామాజిక వర్గ, కులాలకు చెందిన వారిని ‘మొదలియార్’గా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనూ దీనిపై వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. అయితే పైన పేర్కొన్న కులాలకు ‘మొదలియార్’ను టైటిల్‌గా పరిగణించాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన మొదలియార్ సంఘం వినతిపత్రం అందించిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గతంలో గ్రూప్-డి సీరియల్ నెంబర్ 39 ఎదురుగా ‘మొదలియార్’ టైటిల్‌ను చేర్చవలసిందిగా సంఘం ప్రతినిధులు విజ్ఞప్తులు చేసినా చేర్చలేదు. దీంతో ఆ సామాజిక వర్గాలకు ‘మొదలియార్’ పేరుతో కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అనంతరం ఆ ఇబ్బందులు తొలగించేందుకు బిసి జాబితాలోని డి-గ్రూప్‌లో 39వ సీరియల్ నెంబర్ ఎదుట ‘మొదలియార్’ పేరు చేర్చాల్సిందిగా బిసి కమిషన్ ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. తద్వారా ఆ సామాజిక వర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చగలుగుతామని గత జూన్ 17న నిర్వహించిన సమావేశంలో బిసి కమిషన్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి ‘మొదలియార్’ టైటిల్‌ను చేర్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ‘మొదలియార్’ సామాజిక వర్గంలోని ప్రజలకు లాభం చేకూర్చినట్లయింది.