ఆంధ్రప్రదేశ్‌

పోలీసు శిక్షణలో సమూల మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 12: పోలీస్ బోర్డు సూచించిన నిబంధనల మేరకే పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని డిజిపి ఎన్ సాంబశివరావు చెప్పారు. సోమవారం గుంటూరులో నిర్మాణంలో ఉన్న మోడల్ పోలీసు స్టేషన్లను, కానిస్టేబుళ్ల నియామకపు పోటీలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈసందర్భంగా డిపిజి విలేఖర్లతో మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో డిప్లొమా హోల్డర్లు అనర్హులని పోలీసు బోర్డు నిబంధనల్లో పేర్కొందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో 14 వేల పోస్టులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 5,650 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. పోలీసు శిక్షణలో కూడా పెనుమార్పులు తీసుకొస్తున్నామన్నారు.