ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనుల్లో కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 12: ఎట్టకేలకు పోలవరం ఎడమ ప్రధాన కాల్వ (ఎల్‌ఎంసి) పనుల్లో కదలికవచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు ఇపుడు మళ్లీ మొదలయ్యాయి. ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ, విశాఖకు సాగునీరు, పారిశ్రామిక అవసరాల రీత్యా కాలువ పనులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఖరీఫ్‌నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు పనులు మొదలయ్యాయి. కాలువ పొడవు మొత్తం 213 కిలోమీటర్లు. ఇందులో ఇప్పటి వరకు 165 కిలోమీటర్ల మేర పనులు జరిగాయి. ఈ కాలువకు సంబంధించి లైనింగ్ పనులు కేవలం 50 శాతం మేర పూర్తయ్యాయి. మొత్తం 422 స్ట్రక్చర్లు నిర్మించాల్సి వుండగా కేవలం 102 మాత్రమే పూర్తిచేయగలిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 85 స్ట్రక్చర్ల పనులు జరుగుతూనే వున్నాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ కాలువ ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందించడంతోపాటు విశాఖ వరకు నీటిని తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. రూ.1484 కోట్ల అంచనాతో చేపట్టనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని కేవలం తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి అనుబంధంగానే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తేనే వచ్చే ఖరీఫ్ నాటికి అనుకున్నట్టుగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించగలరు. అయితే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి డిసెంబర్ 14 నుంచి రీ టెండర్లు పిలుస్తున్నారు. గతంలో పిలిచిన టెండర్లలో టెక్నికల్ బిడ్‌లో ఒక సంస్థే అర్హత సాధించడంతో మళ్లీ టెండర్లు పిలవడానికి కమిటీ నిర్ణయం తీసుకుందని పోలవరం ఎడమ ప్రధాన కాల్వ సూపరింటెండింగ్ ఇంజనీర్ సుగుణాకరరావు చెప్పారు. మొదటి దశలో 60 కిలో మీటర్ల మేరకు పనులు పూర్తి చేయనున్నారు. ఎడమ ప్రధాన కాలువ రెండేళ్లలో పూర్తిచేసి, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 2.5 లక్షల ఎకరాలకు, విశాఖ జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు నీరివ్వడంతోపాటు విశాఖ పారిశ్రామిక, మంచినీటి అవసరాలను తీర్చాలనేది లక్ష్యం.