ఆంధ్రప్రదేశ్‌

ఎక్కడ హామీలు అక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు, చేస్తున్న ప్రకటనలు అటుంచి పది మంది సమక్షంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవటం అన్నిస్థాయిల్లో, అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో కారణాలేమైనా ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరి కనిపించింది. ఏ ఒక్కరూ రోడ్డెక్కకుండానే పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు, 43 శాతం పీఆర్సీ, సమైక్యాంధ్ర సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించడం వంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల మెప్పు పొందారు. ఆనక ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న హెల్త్‌కార్డుల జారీపై కూడా ఆయన విధారపరమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండేళ్లు పూర్తికావస్తున్నా హెల్త్‌కార్డులు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవటంతో రాష్టవ్య్రాప్తంగా 8 లక్షల మంది పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు నేటికీ పడరాని పాట్లు పడుతున్నారు. దీనిపై ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు, కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు వి విద్యాసాగర్ నేతృత్వంలో పలుమార్లు ప్రతినిధులు సిఎం దృష్టికి తీసుకెళ్లినా కించిత్ మార్పు కనిపించకపోవటంతో ఇక ఉద్యమ బాట పట్టాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దశాబ్దాలుగా ఉద్యోగులకు అమల్లో వున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని 2017 మార్చి వరకు ప్రభుత్వం పొడిగించింది. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యజమాన్యాలు హెల్త్‌కార్డులను తోసిపుచ్చుతున్నారు. 2007లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే తాము శస్తచ్రికిత్సలు చేయడం సాధ్యంకాదని తేల్చిచెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్యశ్రీ ప్యాకేజీలే కొనసాగుతుంటే తాము నాణ్యమైన వైద్యసేవలు ఎలా పొందగలమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అదే ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిట ఆసుపత్రుల్లో ముందుగానే రోగి నుంచి నగదు వసూలు చేసుకుంటున్నారు. ఉదాహరణకు గుండెజబ్బుకు సంబంధించి లక్షా 60వేలు చెల్లిస్తే ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌లో ఉద్యోగికి లక్ష రూపాయలు మించి రావటం లేదు. ఓవైపు నయాపైసా ఖర్చు లేకుండా ఉద్యోగి కుటుంబం మొత్తానికి వైద్య సహాయం అందించేలా హెల్త్‌కార్డులు జారీ చేశామని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రకటించారు. వాస్తవానికి ఇందుకు భిన్నంగా జరుగుతోంది. దీనిపై ఎన్జీవో సంఘం నేత విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఉద్యోగి నెలకు రూ.90లు చెల్లిస్తున్నారని, దీన్ని రూ.300లకు పెంచినా తామంతా చెల్లించేందుకు సుముఖంగా వున్నప్పటికీ ప్రభుత్వం దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోటం లేదన్నారు. వాస్తవానికి జర్నలిస్టుల హెల్త్‌కార్డుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఇదిలావుంటే ప్రభుత్వరంగ సంస్థలు, గ్రంథాలయ సంస్థ, గురుకుల పాఠశాలల ఉద్యోగులు, సిబ్బంది ఎంతోకాలంగా హెల్త్‌కార్డుల కోసం పోరాడుతున్నారు.